Home » ఐపీఎల్ లో కేన్ మామ సరికొత్త రికార్డు…!

ఐపీఎల్ లో కేన్ మామ సరికొత్త రికార్డు…!

by Azhar
Ad

సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. అభిమానుల కేన్ మామ ఐపీఎల్ లో సరికొత్త రికార్డును సృష్టించాడు. ఇప్పటివరకు ఇది ఏ కెప్టెన్ ను కూడా సాధ్యం కాలేదు. ఐపీఎల్ 2022 లో ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్… వరుసగా ఆరు సార్లు టాస్ గెలిచిన ఏకైన కెప్టెన్ గా నిలిచాడు.

Advertisement

అయితే ఐపీఎల్ 2022 లో నేటి మ్యాచ్ తో కలిపి ఆరెంజ్ ఆర్మీ మొత్తం 6 మ్యాచ్ లు ఆడగా.. ఆ ఆరు మ్యాచ్ లలోను టాస్ మన కేన్ మామనే గెలిచాడు. ఈ ఐపీఎల్ 2022 లో ఇప్పటివరకు ఏ కెప్టెన్ కూడా ఇలా వరుసగా ఆరు టాస్ లు గెలవలేదు. అయితే టాస్ లలో సత్తా చూపిస్తున్న మన కేన్ మామ బ్యాటింగ్ లో మాత్రం కొంత వెనకబడి ఉన్నాడు. నేటి మ్యాచ్ లో కూడా విలియమ్సన్ 9 బంతుల్లో 3 పరుగులు చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు.

Advertisement

ఇక ఈ ఐపీఎల్ ను రెండు ఘోర పరాజయాలతో ప్రారంభించిన హైదరాబాద్ జట్టు… నేడు పంజాబ్ పై గెలిచి వరుసగా నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు డబల్ హ్యాట్రిక్ కోసం చూస్తుంది. ఇక సన్ రైజర్స్ తర్వాతి మ్యాచ్ ఈ నెల 23న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుతో ఉంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో కూడా మన కేన్ మామే టాస్ గెలిచి.. మ్యాచ్ కూడా గెలుస్తాడా అనేది.

ఇది కూడా చదవండి :

వార్నర్ కూతుర్లను ఏడిపించిన హాసరంగా…!

వరుసగా నాలుగో విజయంతో సన్ రైజర్స్ హవా…!

Visitors Are Also Reading