Home » చిరు “భోళా శంకర్” మూవీ ని ఆ “ఎన్టీఆర్” సినిమాల నుంచి కాపీ కొట్టారా? టీజర్ లో ఇవి గమనించారా?

చిరు “భోళా శంకర్” మూవీ ని ఆ “ఎన్టీఆర్” సినిమాల నుంచి కాపీ కొట్టారా? టీజర్ లో ఇవి గమనించారా?

by Srilakshmi Bharathi
Ad

మెగాస్టార్ చిరంజీవి అరవైలోనూ ఫుల్ ఫామ్ లో దూసుకు పోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బోలా శంకర్ సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా… ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా మరియు కీర్తి సురేష్ లు కూడా నటిస్తున్నారు.

bhola sankar

Advertisement

ఇందులో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్న నటిస్తుండగా… కీర్తి సురేష్ మాత్రం ఆయన చెల్లెలిగా నటిస్తోంది. ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ దశలో ఉండగా, ఇవాళ ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఈ టీజర్ ఆధ్యాంతం చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ బోలా శంకర్ సినిమా టీజర్ లో మీరు కొన్ని విషయాలను గమనించారా? ఈ విషయాలు గమనిస్తే మీకు కూడా చిరు ఎన్టీఆర్ సినిమాలని కాపీ కొడుతున్నారా? అని అనిపించక మానదు.

bhola sankar

ఎన్టీఆర్ హీరో గా నటించిన రామయ్యా వస్తావయ్యా సినిమా గుర్తుందా? ఈ సినిమాలో ఎన్టీఆర్ పింక్ కలర్ షర్ట్ పై నీలం గళ్ళు ఉన్న షర్ట్ వేసుకుంటారు కదా.

Advertisement

ఇదే షర్ట్ ని మెగాస్టార్ కూడా వేసుకుని భోళా శంకర్ టీజర్ లో కనిపించారు. అలాగే, బ్లాక్ అండ్ వైట్ గళ్ళ చొక్కా కూడా ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ ని పోలి ఉంది. దీనితో నెట్టింట్లో ట్రోలింగ్ షురూ అయింది. ఎన్టీఆర్ స్టైల్స్ ని చిరు కాపీ కొడుతున్నారా అంటూ మేము పేజెస్ సందడి చేస్తున్నాయి. ఇదే కాకుండా అరవింద సమేత వీర రాఘవ సినిమాలో ఆఖరులో వచ్చే మీటింగ్ ఫైట్ ని పోలిన ఫైట్ సీన్ కూడా భోళాశంకర్ టీజర్ లో కనిపించింది. ఈ విషయమై సోషల్ మీడియాలో మీమ్స్ తెగ హల్ చల్ అవుతున్నాయి.

మరిన్ని ముఖ్య వార్తలు:

సొంతంగా విమానాలు ఉన్న టాలీవుడ్ హీరోలు ఎవరెవరో తెలుసా?

టీమిండియా నుంచి ఔట్‌.. పుజారా సంచలన నిర్ణయం

Samantha : మళ్లీ లవ్ లో పడ్డ హీరోయిన్ సమంత.. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading