Home » భట్టి విక్రమార్క:కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది..సీఎం ఆయనేనా..?

భట్టి విక్రమార్క:కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది..సీఎం ఆయనేనా..?

by Sravanthi
Ad

కాంగ్రెస్ పార్టీ అంటేనే అత్యంత రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ, అంతేకాదు భారతదేశాన్ని ఎక్కువ కాలం పాలించిన పార్టీ కూడా ఇదే. అలాంటి ఈ పార్టీ ప్రస్తుతం దేశంలో కాస్త వెనుకబడిపోయిందని చెప్పవచ్చు. ఈ పార్టీలో ఉండే సీనియర్ నాయకులు మరియు జూనియర్ నాయకుల మధ్య ఎప్పుడు ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంటుంది. గల్లి నుంచి ఢిల్లీ వరకు ఎప్పుడు గొడవలే జరుగుతాయి. అలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాస్త మెరుగవుతుందని చెప్పవచ్చు.

Advertisement

Also Read:పెళ్లిళ్లు చేసుకోవడంలో తెలంగాణ యువతులే బేటరా..ఆ సర్వే ఏం చెబుతుందంటే..?

రాబోవు ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఓవైపు రేవంత్ రెడ్డి మరోవైపు భట్టి విక్రమార్క, ఇతర నాయకులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన మంచిర్యాల సభలో బట్టి విక్రమార్క పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. రేవంత్ రెడ్డికి నాకు మధ్య వివాదాలు ఉన్నాయనేది అవాస్తవమని కొట్టి పారేశారు. ఈ సభ జరిగినప్పటి నుంచే ముఖ్యమంత్రి రేసులో భట్టి విక్రమార్క ఉన్నారని పేరు ప్రధానంగా వినిపిస్తోంది. దీనికి తోడుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడే ముఖ్యమంత్రి అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Advertisement

Also Read:దర్శకుడు సుకుమార్ పై IT దాడులు.. ఆ MLAలు కారణమని మీకు తెలుసా..?

ఈ విధమైన ఆరోపణలు వినిపిస్తున్న వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరనేది అనేది భట్టి  క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎవరు అనేది అధిష్టానమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందే అభ్యర్థిని ప్రకటించే సాంప్రదాయం కాంగ్రెస్ లో లేదని అన్నారు. అయితే ఎన్నికల ఫలితాలు తర్వాత సీఎల్పీ తో మాట్లాడి నిర్ణయిస్తామని భట్టి పేర్కొన్నారు . వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని అందుకే పార్టీలో పోటీ తత్వం పెరిగిందని తెలియజేశారు

Also Read:రాఘవేంద్రరావు పాటల్లో పండ్లు, పూలు వాడటం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా..?

Visitors Are Also Reading