Home » భారతీయుడు ఈజ్ బ్యాక్.. ఇండియన్‌ 2 ఇంట్రో గ్లింప్స్ అదుర్స్

భారతీయుడు ఈజ్ బ్యాక్.. ఇండియన్‌ 2 ఇంట్రో గ్లింప్స్ అదుర్స్

by Anji
Ad

విశ్వనటుడు కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. 1996లో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు భారతీయుడు 2 రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా ఇంట్రో గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగులో ఈ గ్లింప్స్ ను స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి రిలీజ్ చేశారు. భారతీయుడులో లంచానికి వ్యతిరేకంగా పోరాడిన వీరశేఖరన్ సేనాపతి ఇండియాలో మళ్లీ తప్పు జరిగితే తాను తిరిగి వస్తానని చెప్పటంతో కథ ముగిసింది.

Advertisement

అయితే ఇప్పుడు దేశంలో మళ్ళీ లంచగొండితనం పెరిగిపోతుంది. లంచం లేనిదే అధికారులు ఎవరూ ఏ పనులు చేయటం లేదు. దీంతో సామాన్యుడు కష్టంగా మారింది. అప్పుడు భారతీయులందరూ కమ్ బ్యాక్ ఇండియన్ అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి మళ్లీ దేశంలోకి భారతీయుడు అడుగు పెట్టాలని రిక్వెస్టులు పంపుతారు. చివరకు వీరశేఖరన్ సేనాపతి ఇండియాలోకి అడుగు పెడతారు. వచ్చిన తర్వాత సేనాపతి ఏం చేశారు. భారతీయుడుకి భయపడి లంచాలు మానేసిన అధికారులు మళ్ళీ లంచాలు తీసుకోవడానికి కారణం ఎవరు?

Advertisement

పేట్రేగిన లంచం వల్ల దేశంలో ఎలాంటి అల్లకల్లోలాలు జరిగాయి? అనే విషయాలను గ్లింప్స్ చూపించారు. గ్లింప్స్ అయితే ఇక అదిరిపోయాయి.ఈ గ్లింప్స్ లో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్. జె. సూర్య, బాబీ సహా తదితరులు కనిపించారు. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్, హిందీలో మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో కిచ్చా సుదీప్ విడుదల చేశారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి !     తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading