Home » బాలయ్య అన్ స్టపబుల్ కి పవన్ కళ్యాణ్ వస్తున్నారని హింట్ భలే ఇచ్చారుగా..?

బాలయ్య అన్ స్టపబుల్ కి పవన్ కళ్యాణ్ వస్తున్నారని హింట్ భలే ఇచ్చారుగా..?

by Anji
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా మూడు రంగాల్లో రాణిస్తున్నారు. ఓ వైపు సినిమాల్లో, మరోవైపు రాజకీయాల్లో, తాజాగా బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. ఇక బాలయ్య తనదైన మాస్ డైలాగులు, ఫైటింగ్ లతో ప్రేక్షకులకు కట్టిపడేసి తొలిసారి హూస్టుగా మారిన షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకె’. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న ఈ షోకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తొలి సీజన్ ను పూర్తి చేసుకున్న ఈ టాక్ షో తాజాగా చంద్రబాబు నాయుడు , లోకేష్ లు అతిధులుగా రెండో సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే.

Also Read : “సలార్” క్లైమాక్స్ ఓ రేంజ్ లో ఉండబోతుందా..గూస్ బంప్స్ తెప్పించే లేటెస్ట్ అప్డేట్..!!

Advertisement

మరింత రెట్టించిన ఉత్సాహంతో మొదలైన ఈ షో పేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఈ తరుణంలోనే తాజాగా ఈ షో కి యంగ్ హీరోలు విశ్వక్ సేన్ తో పాటు, సిద్దు జొన్నలగడ్డ హాజరవుతున్నారు.తాజాగా మేకర్స్ ఈ ఎపిసోడ్ కి సంబంధించి టీజర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఇద్దరు కుర్ర హీరోలతో పోటీపడి మరీ రచ్చ చేశారు బాలయ్య. ఈ క్రమంలోనే వీరిద్దరితోపాటు షోకు హాజరైన నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు త్రివిక్రమ్ తో ఫోన్ లో మాట్లాడారు. ఈ సమయంలోనే ఫోన్ తీసుకున్న బాలయ్య మాట్లాడుతూ.. ‘త్రివిక్రమ్ షోకి ఎప్పుడు వస్తున్నావ్’ అని అడగ్గా, దానికి త్రివిక్రమ్ బదులిస్తూ.. ‘మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తాను సార్’ అన్నారు.

Advertisement

Also Read : రాజ‌బాబు కుమారులు దేశం గ‌ర్వించే స్థాయిలో స్థిర‌ప‌డ్డార‌ని తెలుసా..? ఏం చేస్తున్నారంటే..?

వెంటనే బదులిచ్చి బాలయ్య ‘షోకి ఎవరితో రావాలో తెలుసుగా’ అని అనగ్గానే ప్రేక్షకులకు పెద్ద ఎత్తున క్లాప్స్ కొడుతూ హంగామా చేశారు. దీంతో అందరికీ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కలిసి వస్తారని పవన్ కళ్యాణ్ అని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా టాక్ షోలలో పాల్గొనలేదు.. అయితే బాలయ్య అన్ స్టాపబుల్ కి హాజరైతే మాత్రం ఆయన ఫ్యాన్స్ కి పండగ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇది వాస్తవానికి కార్యరూపం దాల్చుతోందో లేదో అనేది వేచి చూడాలి.

Also Read : ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన గీతాసింగ్ జీవితంలో ఇంత విషాదం ఉందా…? సినిమాలకు ఎందుకు దూరం అయ్యారంటే…?

 

Visitors Are Also Reading