Telugu News » Blog » భళా తంధాననా ఓటీటీ రైట్స్, రిలీజ్ డేట్, సాటిలైట్ రైట్స్

భళా తంధాననా ఓటీటీ రైట్స్, రిలీజ్ డేట్, సాటిలైట్ రైట్స్

by Manohar Reddy Mano
Ads

విభిన్నమైన చిత్రాలను చేస్తూ టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు శ్రీవిష్ణు. అయితే ఇప్పుడు అతని కెరీర్‌లో కొత్తగా వసిస్తున్న సినిమా భళా తంధాననా. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ భళా తంధాననా అనే సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం మరియు జయమ్మ పంచాయితీ అనే సినిమాతో పాటుగా ఈరోజే విడుదలైంది.

Advertisement

ఇదిలా ఉంటె… తాజా సమాచారం ప్రకారం ఈ భళా తంధాననా యొక్క ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ హాట్‌స్టార్ కొనుగోలు చేసింది అని తెలుస్తుంది. అలాగే శాటిలైట్ హక్కులు స్టార్ మాకి వెళ్లాయి. అయితే శ్రీవిష్ణు సినిమాలు అనేవి ఎలా ఉన్న అభిమానులు.. అతను ఏదో కొత్తగా చేస్తాడు అనే ఆలోచనతో ఒక్కసారి సినిమా చూస్తారు. అందుకే ఊహించిన దానికంటే ఈ సినిమా రైట్స్ ఎక్కువ ధరకే అమ్ముడుపోయాయి అని సమాచారం.

Advertisement

నేడు విడుదలైన ఈ సినిమా కొన్ని వారాల తర్వాత డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుందనే మాట వినిపిస్తుంది. అయితే ఈ శ్రీవిష్ణు సినిమా చాలా తక్కువ హైప్‌తో విడుదలైంది. దీనితో పాటు విడుదలైన సుమ, విశ్వక్ సేన్ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. కానీ ఆ రేంజ్ లో ఈ సినిమాకు క్రేజ్ లేదు. ఈ సినిమా ప్రమోషన్లు కూడా తక్కువ గానే జరిగాయి. కాబట్టి ఈ సినిమా విజయం కావాలంటే.. అభిమానుల నుంచి మంచి హిట్ టాక్ తెచ్చుకోవాలి. ఇక మరోవైపు, శ్రీవిష్ణుకు కూడా ఇటీవల సరైన హిట్ లేదు. దాంతో తన ఆశలు మొత్తం ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి :

ధోని మాటలకు అర్ధం అదే..!

Advertisement

గుజరాత్ టైటాన్స్ తరపున పోలార్డ్…?