Home » Bhagavanth Kesari: “భగవంత్ కేసరి” సినిమాకు ముందు హీరోగా అనుకున్నది బాలకృష్ణను కాదా? ముసలోళ్ల కథ అంటూ రిజెక్ట్ చేసిన స్టార్ హీరో?

Bhagavanth Kesari: “భగవంత్ కేసరి” సినిమాకు ముందు హీరోగా అనుకున్నది బాలకృష్ణను కాదా? ముసలోళ్ల కథ అంటూ రిజెక్ట్ చేసిన స్టార్ హీరో?

by Srilakshmi Bharathi
Published: Last Updated on

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా “భగవంత్ కేసరి” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా పూర్తి అవుతున్నాయి. అయితే ఈ సినిమా బడ్జెట్ భారీగానే ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య బాబుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, బాలయ్య బాబు కూతురిగా శ్రీలీల నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం గట్టిగానే ప్రయత్నిస్తోంది.

bhagavanth kesari 1

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్ మంచి ఎఫెక్ట్ చూపిస్తోంది. తెలంగాణ యాసలో మంచి యాక్షన్ సినిమాగా అనిల్ రావిపూడి “భగవంత్ కేసరి” ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా.. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథను మొదట బాలకృష్ణ కోసం రాసుకోలేదట. ఈ స్టోరీ ని దర్శకుడు అనిల్ రావిపూడి ముందుగా ఓ స్టార్ హీరో కు వినిపించారట. అయితే.. ఇది ముసలి స్టోరీ అని.. కథ నచ్చింది కానీ, ముసలి హీరోలకే సూట్ అవుతుంది అంటూ సదరు స్టార్ హీరో కామెంట్ చేశారట.

దీనితో అనిల్ రావిపూడి ఆ హీరోతో ఈ సినిమా చేయాలన్న ఆలోచనని విరమించుకున్నారట. అయితే.. ఈ సినిమా విషయంలో వెనకడుగు వెయ్యకుండా.. బాలకృష్ణను కలిసి ఈ కథను వినిపించారట. అయితే.. బాలకృష్ణకు కూడా ఈ సినిమా స్టోరీ నచ్చడంతో అనిల్ రావిపూడి అవకాశం ఇచ్చారట. అలా.. ఈ సినిమా పట్టాలెక్కింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా నాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్నీ అనిల్ రావిపూడి తన సన్నిహితుల వద్ద చెప్పుకోవడంతో ఈ న్యూస్ బయటకు వచ్చింది.

Bhagavanth Kesari: “భగవంత్ కేసరి” సినిమాకు ముందు హీరోగా అనుకున్నది బాలకృష్ణను కాదా? ముసలోళ్ల కథ అంటూ రిజెక్ట్ చేసిన స్టార్ హీరో?

సిసింద్రీ కాకుండా.. అక్కినేని అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ సినిమా గురించి తెలుసా?

చిరంజీవి, ఏఎన్నార్ కలిసి నటించిన ఆ ఒక్క సినిమా ఏదో తెలుసా?

Visitors Are Also Reading