Home » ఎన్టీఆర్ గారి కంటే ముందు రాజకీయాల్లో చక్రం తిప్పిన తోలి తెలుగు సినీ నటుడి గురించి ఈ విషయాలు తెలుసా ?

ఎన్టీఆర్ గారి కంటే ముందు రాజకీయాల్లో చక్రం తిప్పిన తోలి తెలుగు సినీ నటుడి గురించి ఈ విషయాలు తెలుసా ?

by AJAY
Ad

రాజ‌కీయాల్లో సినిమా వాళ్లు చ‌క్రం తిప్ప‌డం స‌ర్వ‌సాధార‌ణం. టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా మేక‌ప్ వేసుకుని సినిమాలో రాణించిన‌వారు ఆ త‌ర‌వాత రాజీకీయాల్లో చ‌క్రం తిప్పారు. అలా రాజ‌కీయాల‌లో చ‌క్రం తిప్పిన వారి విష‌యానికి వ‌స్తే ఎంజీఆర్, జ‌య‌ల‌లిత పేర్లు గుర్తుకు వ‌స్తాయి. అంతే కాకుండా తెలుగు నాట సినిమాల్లో రాణించి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన త‌ర‌వాత సంచ‌ల‌నాలు సృష్టించిన న‌టుడు ఎన్టీరామారావు అని అంద‌రికీ తెలుసు.

Advertisement

పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తెలుగుదేశం పార్టిని స్థాపించిన ఎన్టీఆర్ అతి త‌క్కువ కాలంలోనే సీఎం స్థాయికి ఎదిగారు. కానీ ఎన్టీఆర్ కంటే మందే ఓ న‌టుడు పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి రాజ‌కీయాల్లో రానించార‌న్న విష‌యం అతికొద్ది మందికి మాత్ర‌మే తెలుసు. ఆయ‌న ఎవ‌రో కాదు కొంగ‌ర జ‌గ్గ‌య్య‌. దేశంలో సినిమా రంగం నుండి వ‌చ్చి జాతీయ‌రాజ‌కీయాల్లో స‌త్తా చాటిన న‌టుడు కూడా ఈయ‌నే. అంతే కాకుండా కొంగ‌ర జగ్గ‌య్య న‌టుల‌లో మొద‌టిసారి లోక్ స‌భకు ఎన్నిక‌య్యారు.

Advertisement

కొంగ‌ర జ‌గ్గ‌య్య ఎన్టీఆర్ కూడా సన్నిహితుడు కావ‌డం విషేషం. ఈయ‌న గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ గ్రామంలో ధ‌న‌వంతుల కుటుంబంలో జ‌న్మించాడు. గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియ‌న్ కాలేజీలో కొంగ‌ర జ‌గ్గ‌య్య చ‌దువుకున్నాడు. అదే కాలేజీలో ఎన్టీరామారావు కూడా విద్య‌ను అభ్య‌సించారు. అక్క‌డే వీరిద్ద‌రి మ‌ధ్య ప‌రిచయం ఏర్పడింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర‌వాత జ‌గ్గ‌య్య వ‌రుస‌గా మూడు సంవత్స‌రాల పాటు ఉత్త‌మ నటుడు పుర‌స్కారాన్ని అందుకున్నాడు.

ఎన్టీఆర్ తో క‌లిసి జ‌గ్గ‌య్య నాట‌కాలు కూడా వేశారు. విద్యార్థిగా ఉన్న‌ప్పుడే జ‌గ్గ‌య్య రాజ‌కీయాల్లో చురుకుగా ఉండేవారు. జ‌య‌ప్ర‌కాష్ స్థాపించిన ప్ర‌జా సోష‌లిస్ట్ పార్టీలో జ‌గ్గ‌య్య రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైంది. ఇక 1956 కాంగ్రెస్ లో చేరారు. 1967వ సంవత్స‌రంలో ఒంగోలు నుండి కాంగ్రెస్ నుండి పోటీ చేసి లోక్ స‌భ‌కు ఎన్నిక‌య్యాడు. ఆయ‌న‌కు 80వేల మెజారిటీ రావ‌డం విశేషం. ఇక ఎంపీగా గెలిచిన త‌ర‌వాత ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ఎన్నో కార్య‌క్ర‌మాల‌ను జ‌గ్గ‌య్య చేశారు.

ALSO READ : ఎన్టీఆర్, రజినీకాంత్ సినిమాలకు దీటుగా నిలిచి చిరుకి వంద రోజులు ఆడిన తొలి సినిమా ..!

Visitors Are Also Reading