Home » ఎన్టీఆర్, రజినీకాంత్ సినిమాలకు దీటుగా నిలిచి చిరుకి వంద రోజులు ఆడిన తొలి సినిమా ..!

ఎన్టీఆర్, రజినీకాంత్ సినిమాలకు దీటుగా నిలిచి చిరుకి వంద రోజులు ఆడిన తొలి సినిమా ..!

by AJAY
Ad

ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నా మెగాస్టార్ చిరంజీవికి ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంటుంది. ఆయ‌న న‌ట‌న‌తో పాటూ ఆయ‌న డ్యాన్సింగ్ స్టైల్… కామెడీ టైమింగ్ వేరే లెవ‌ల్ లో ఉంటాయి. సాధార‌ణ కానిస్టేబుల్ కొడుకుగా మెగాస్టార్ సినిమాల్లోకి వ‌చ్చారు. కెరీర్ ప్రారంభంలో అంద‌రిలాగే అనేక ఇబ్బందులు ఎదురుకున్నారు. ఏమీ లేని స్టేజ్ నుండి మెగాస్టార్ గా ఎదిగారు. మెగాస్టార్ 1978 లో ప్రాణం ఖ‌రీదు అనే సినిమాతో సినీరంగ ప్ర‌వేశం చేశాడు. ఆ త‌ర‌వాత దాదాపు పది సినిమాల వ‌ర‌కూ చేశాడు. కానీ కోత‌ల రాయుడు అనే సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించాడు.

Advertisement

ఈ సినిమాలో చిరంజీవి నెగిటివ్ షేడ్స్ ఉన్న‌ రోల్ లో న‌టించాడు. ఈ సినిమాను త‌మ్మారెడ్డి భ‌రద్వాజ, వాసు క‌లిసి నిర్మించారు. ఈ సినిమాలో చిరంజీవి కోత‌లు కోస్తూ అల్ల‌రి చిల్ల‌ర‌గా తిరిగే అబ్బాయి పాత్ర‌లో న‌టించాడు. ఈ సినిమాలో మాధ‌వి హీరోయిన్ గా న‌టించారు. అంతే కాకుండా ఈ సినిమాకు చిరంజీవి ఎలాంటి రెమ్యున‌రేష్ తీసుకోక‌పోవ‌డం విశేషం.

Advertisement

ఇక ఈ సినిమాకు రెండు వారాల ముందు ఎన్టీరామారావు, ర‌జినీకాంత్ హీరోలుగా న‌టించిన టైగ‌ర్ అనే సినిమా విడుద‌లైంది. ఈ సినిమా థియేట‌ర్ ల‌లో అప్ప‌టికే ర‌న్ అవుతోంది. మ‌రోవైపు ఎన్టీఆర్ బాల‌కృష్ణ క‌లిసి న‌టించిన శ్రీ తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర క‌ల్యాణం సినిమా విడుద‌లైంది. ఇలా రెండు బ‌డా సినిమాల మ‌ధ్య చిరంజీవి మొద‌టి సినిమా కోత‌ల రాయుడు విడుద‌లైంది.

ఇక ఈ సినిమా ఆ రెండు సినిమాల‌ను బీట్ చేసింది. అంతే కాకుండా వంద రోజులు ఆడింది. ఈ చిత్రానికి అప్ప‌ట్లో క‌లెక్ష‌న్ ల వ‌ర్షం కురిసింది. ఈ సినిమాతో చిరు ఓవ‌ర్ నైట్ స్టార్ అయ్యాడు. ఆ త‌ర‌వాత వ‌రుస అవ‌కాశాలు అందుకుని స్టార్ హీరోగా ఎదిగాడు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కంటే ఎక్కువ రెమ్యున‌రేష్ అందుకున్న రికార్డు కూడా చిరుకే ద‌క్కింది.

Visitors Are Also Reading