Home » అలలు చెక్కిన శిల్పాలు ఎక్క‌డో తెలుసా..?

అలలు చెక్కిన శిల్పాలు ఎక్క‌డో తెలుసా..?

by Anji
Ad

ఉవ్వెత్తున ఎగిసి ప‌డే అల‌లు, అలుపు సొలుపు లేని కెర‌టాలు ఒక‌దాని వెంట మ‌రొక‌టి వ‌స్తూ అక్క‌డ ఉన్న బండ‌రాళ్లను సుతారంగా తాకుతూ అద్భుత‌మైన శిల్పాలుగా చెక్కుతున్నాయి. ఆ ప్ర‌దేశాన్ని సుంద‌రంగా తీర్చిదిద్దుతాయి. చూపరుల‌ను ఆశ్చ‌ర్య చ‌కితుల‌ను చేస్తున్నాయి. శిల‌ల‌పై శిల్పాలు చెక్కార‌న‌నాడు ఓ సినీ క‌వి. కానీ ఇక్క‌డి రాళ్ల‌ను చూస్తే.. వాటి ఆకృతుల‌ను ప‌రిశీలిస్తే అల‌లు చెక్కిన శిల్పాలు అనాల్సిందే.

Also Read :  ఒకే ఒక్క డ్రెస్ తో సినిమా అంతా కంప్లీట్! అలాంటి 8 సినిమాలు!

Advertisement

అంద‌మైన సాగ‌ర‌తీరం విశాఖ సొంతం. ఆహ్ల‌దాన్ని పంచే ఆర్‌.కే బీచ్‌, రుషికొండ బీచ్‌తో పాటు యారాడ బీచ్‌కూడా విశాక ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేస్తాయ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఎంతో సువిశాల‌మైన విశాఖ సాగ‌ర‌తీరంల పెద్ద‌గా ప్ర‌చారం లేని మ‌రొక ప్రాంతం పెద‌గంట్వాడ మండ‌లంలోని పాత గంగ‌వ‌రంలో ఉంది. గంగ‌వ‌రం పోర్టు వెనుక గ‌ల స‌ముద్ర తీరం ఆహ్లాదాన్ని పంచుతుంది. ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తోంది. ఇక్క‌డ కొండ‌ల‌పై కొలువు దీరిన రాధామాధ‌వ స్వామి ఆల‌యం వెనుక స‌ముద్రం ఒడ్డున ఉన్న ఓ కొండ అంద‌మైన గుహ‌ల‌తో విర‌జిల్లుతోంది. రాధామాధ‌వ \స్వామి ఆల‌యం నుంచి కింద‌కు దిగుతున్న కొద్ది వివిధ రూపాల్లో ఉన్న రాళ్లు ఆక‌ర్షిస్తున్నాయి.

Advertisement

కొండ‌ను ఆనుకుని స‌ముద్రం ఉండ‌డంతో సాగ‌రం నుంచి వ‌చ్చే అల‌లు వాటిని తాకుతూ అంద‌మైన శిల్పాలుగా మ‌ల‌చ‌డంతో ఈ ప్రాంతం ఇప్పుడు మండ‌లంలో ప్ర‌త్యేకంగా నిలుస్తుంది. ఇటీవ‌ల కాలంలో పాత గంగ‌వ‌రం పేర మారుమ్రోగుతుందంటే దానికి కార‌ణంగా స‌ముద్రం ఒడ్డున ఉన్న రాళ్లే. ఇప్పుడు ఈ ప్రాంతం ఒక ప‌ర్యాట‌క కేంద్రంగా మారింది.

నిత్యం ఎంతో మంది రాధా మాధ‌వ‌స్వామి ఆల‌యానికి వెళ్లితే.. అక్క‌డి నుంచి కింద‌కు దిగుతూ అందంగా పేర్చిన‌ట్టు ఉండే రాళ్ల మ‌ధ్య ఆట‌లాడుతూ ఫొటోలు దిగుతూ ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు అక్క‌డే ఉల్లాసంగా, ఉత్సాహంగా గ‌డుపుతున్నారు. అక్క‌డే ఉన్న సొరంగాల్లోకి వెళ్లుతూ కేరింత‌లు కొడుతున్నారు. ఇంత సుంద‌ర‌మైన సాగ‌ర‌తీరాన్ని ప్ర‌త్య‌క్షంగా వీక్షించేందుకు యువ‌త ఉర్రూత‌లూగుతున్నారు.

Also Read :  మోహ‌న్‌బాబు హిట్ సినిమాను జ‌య‌సుధ ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా..?

Visitors Are Also Reading