ఉదయం వేళ 11 గంటలు కాగానే సూర్యుడు మాడు పగులకొడుతున్నాడు. ఇక ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు ముందు రోజులు ఎలా ఉంటాయో అని భయం జనాల్లో కలుగుతుంది. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సమయంలోనే విపరీతైన ఎండ.. మరోవైపు మధ్యాహ్నం వడగాలులు వీస్తున్నాయి. దీంతో బయటికీ వెళ్లాలంటేనే ప్రజలకు జంకుతున్నారు. మరో రెండు మూడు రోజుల పాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read : Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు రోజు రోజుకు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. అదేవిధంగా వడదెబ్బ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నమోదు అవుతున్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ సీజన్ లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లోనే ఉట్నూు మండలం పులిమడుగుల ఒకరు, కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ లో ఇబ్రాహీం అనే పండ్ల వ్యాపారి వడదెబ్బతో మృతి చెందాడు. ఇక ఈ సీజన్ లో ఇప్పటివరకు మొత్తం 5 వడదెబ్బ మరణాలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
Advertisement
వేడి వాతావరణంలో ఇండ్ల నుంచి బయటికి వచ్చే వారు త్వరగా డీ హైడ్రేషన్ కి గురవుతున్నారు. వేడి తరంగాల ప్రతికూల ప్రభావాన్ని నివారించడానికి ముఖ్యంగా పగటిపూట వీలు అయినంత ఎక్కువ నీరు తాగాలని వైద్యులు ప్రజలకు సలహా ఇస్తున్నారు. వచ్చే సీజన్ కి భూములను సిద్ధం చేయడంతో రైతులు వ్యవసాయ పనులు చేయడం మానేశారు. నీటి వనరులు చాలా వరకు ఎండిపోవడంతో ఆవులు, ఎద్దులకు తాగునీరు అందించలేకపోతున్నామని కొందరూ రైతులు పేర్కొంటున్నారు. కొందరూ తమ పెంపుడు జంతువులను దాహం తీర్చుకునేందుకు సమీపంలోని ట్యాంకుల వద్దకు తీసుకెళ్లి పశువుల కొట్టాల్లో ఉంచుతున్నారు. రాష్ట్రంలో వేడి గాలులు వీస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు బయటికి వెళ్లకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, సీనియర్ సిటిజన్లు, హై రిస్క్ గ్రూపులలోని పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : అంబానీ కోడలు మెడలోని నెక్లెస్ ఖరీదు. అక్షరాల 500 కోట్లు! ఇంతకీ నెక్లెస్ స్పెషాలిటీ ఏంటీ !