Home » సాయిధరమ్ తేజ విరూపాక్ష మేకింగ్ వీడియో చూశారా ? ఎలా ఉందంటే? 

సాయిధరమ్ తేజ విరూపాక్ష మేకింగ్ వీడియో చూశారా ? ఎలా ఉందంటే? 

by Anji
Ad

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొంచెం గ్యాప్ తరువాత విరూపాక్ష మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో వస్తోన్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఇప్పటికే క్యూరియాసిటీని పెంచేసింది. ఈ మూవీలో తేజ్ కి జంటగా సంయుక్తమీనన్ నటిస్తోంది. కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. 

Also Read :  50 ఏళ్ళు దాటుతున్న ఇప్పటికి పెళ్లి కానీ నటీమణులు ! ప్రేమ వైఫల్యమే కారణమా ?

Advertisement

సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే ఇప్పటివరకు రాని డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా కావడంతో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే అన్ని కార్యకర్యక్రమాలను పూర్తి చేసుకొని ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. ఇది తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదలవుతోంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా.. మేకింగ్ వీడియో విడుదల చేశారు.హర్రర్ థ్రిల్లర్  నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది ఈ మేకింగ్ వీడియో.

Advertisement

ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పూర్తి అయింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.25కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. నైజాంలో రూ.7.20 కోట్లుకు మూవీ రిలీజ్ రైట్స్ సొంతం చేసుకుంది. వైజాగ్ 2.25, ఈస్ట్ గోదావరి 1.45, వెస్ట్ 1.25, కృష్ణ 1.45 కోట్లు, గుంటూరు 1.65, నెల్లూరు రూ.70లక్షలు, సీడెడ్ 3.85 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. యాక్సిడెంట్ తరువాత వస్తున్న ఫస్ట్ కావడం.. మరోవైపు డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తుండటంతో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 21న విడుదలయ్యే ఈ సినిమా ఫలితం ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి మరి. 

Also Read :  పట్టుమ‌ని పాతికేళ్లు నిండ‌కుండానే పెళ్లి చేసుకున్న 10 మంది స్టార్ హీరోయిన్ లు వీళ్లే..!

Visitors Are Also Reading