Home » టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ ఆర్డర్.. రావాల్సిందే..?

టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ ఆర్డర్.. రావాల్సిందే..?

by Azhar
Ad
ఐపీఎల్ 2022 సీజన్ ముగిసింది. రెండు నెలలకు పైగా జరిగిన ఈ పోరు ముగియడంతో ఆటగాళ్లు అందరూ తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే వచ్చే నెల 9 నుండి భారత జట్టుకు సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ లో పాల్గొనే ఆటగాళ్లం ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది కూడా. అయితే ఈ సిరీస్ కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, షమీ వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతిని కల్పించగా… కేఎల్ రాహుల్ ఈ జట్టుకు న్యాయకత్వం వహించనున్నాడు.
అయితే ఈ సిరీస్ కు ఎంపికైన ఆటగాళ్లకు అందరికి బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. సౌత్ ఆఫ్రికా సిరీస్ ఆడే ఆటగాళ్లు అందరూ ఈ నెల 5న ఢిల్లీలో జరిగే సమావేశానికి రావాలని తెలిపింది. ఇప్పటికే ఇందుకోసం ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆటగాళ్లకు సందేశాలు కూడా పంపింది. ఈ సేర్సి లో మొదటి మ్యాచ్ జూన్ 9న ప్రారంభం కానుండగా… మిగిలిన నాలుగు టీ20ల విషయానికొస్తే అవి వరుసగా జూన్ 12, 14, 17, 19వ తేదీల్లో మిగిలిన నాలుగు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక ఈ సిరీస్ ముగిసిన వెంటనే సీనియర్ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్తుంది.
అక్కడ గత ఏడాది వాయిదా పడిన చివరి టెస్ట్ మ్యాచ్ తో పాటుగా 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ కూడా ఆడనుంది. అయితే ఈ సిరీస్ కోసం భారత జట్టు  వచ్చే నెల 16న ఇక్కడి నుండి బయలు దేరుతుంది. అయితే సఫారీలతో టీ20 సిటీస్ ఆడుతూ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ఆటగాళ్లు 18న వెళ్తారు. ఇక ఆ తర్వాత మరో భారత జట్టు రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు జూన్ 23 లేదా 24న వెళ్తుంది. ఈ సిరీస్ కు వీవీఎస్ లక్షణ్ హెడ్ కోచ్ గా ఉండనున్నాడు.

Advertisement

Visitors Are Also Reading