Chankya Niti: ఆచార్య చాణక్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతనికి చాణక్యుడు, కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు ఇలా పలు బిరుదులు కలవు. ఒక్కొక్కరూ ఒక్క రకమైన పేర్లతో పిలుస్తుంటారు. పూర్వకాలంలో ఆయన మేథస్సు ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఆయన రాసిన పలు విషయాలను మనం మననం చేసుకుంటున్నాం. ముఖ్యంగా చాణక్య తన జీవితంలో ఎదురైనటువంటి ఎన్నో ఘటనలను, అనుభవాలను చాణక్య నీతిలో తెలిపారు.
Advertisement
అర్థశాస్త్రం, సామాజిక శాస్త్రం, రాజకీయం, సైనిక శాస్త్రం, దౌత్యం, మతం తదితర అంశాల్లో చాణక్యుడు మంచి పరిజ్ఞానం కలిగి ఉన్నాడు. అందుకే చాణక్య బోధనలు ఇప్పటికీ అందరికీ స్పూర్తినిస్తాయి. చాణక్య నీతి ప్రకారం.. పరిశుభ్రతతో పాటు ఆరోగ్య రిత్యా కూడా స్నానం కూడా ఎంతో మంచిదని చాణక్య వెల్లడించారు. అంత్యక్రియలకు హాజరైన వ్యక్తి ఇంట్లోకి వచ్చే ముందు తప్పనిసరిగా స్నానం చేయాలని సూచించారు. మనిషి మరణం తరువాత అతని శరీరం సూక్ష్మక్రములతో పోరాడే సామర్థాన్ని కోల్పోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ మృతదేహాన్ని తాకినప్పుడు ఇతరులకు అనారోగ్యం సంభవించే ప్రమాదముంటుందన్నారు.
Advertisement
అదేవిధంగా ఆరోగ్యకరమైన శరీరం, మెరిసే చర్మం కోసం మసాజ్ చేయాలని సూచించారు. శరీరానికి నూనెను పూయడం వల్ల శరీరంలోని మురికి బయటకు పోతుంది. అందుకే మసాజ్ చేసిన తరువాత కొద్దిసేపు గడిచిన తరువాత తలస్నానం చేయాలని చాణక్య సూచించారు. వెంట్రుకలు శరీరంలో అక్కడక్కడా అతుక్కుపోయి అనారోగ్యం వాటిల్లే విదంగా చేస్తాయని తెలిపారు. అందుకే జుట్టు కత్తిరించుకున్న తరువాత తప్పనిసరిగా తల స్నానం చేయాలని చెప్పారు చాణక్య. చాలా వరకు మనం తెలిసో తెలియకో చాణక్య నీతిలో చెప్పిన విధానాన్ని పాటిస్తుంటాం. కొన్ని తెలియని విషయాలను ఇప్పుడు తెలుసుకున్నాం.
Also Read :
Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు
మీ ఇంట్లో చిల్లర డబ్బులు ఈ ప్రదేశంలో పెడితే ఇక ధనవర్షమే..!!