Home » బ‌ప్పి ల‌హిరి టాప్ సూప‌ర్ హిట్ తెలుగు సాంగ్స్ తెలుసా..?

బ‌ప్పి ల‌హిరి టాప్ సూప‌ర్ హిట్ తెలుగు సాంగ్స్ తెలుసా..?

by Anji
Ad

డిస్కో మ్యూజిక్ కింగ్‌, సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పి ల‌హిరి బుధ‌వారం ఉద‌యం మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న 69 ఏళ్ల బ‌ప్పి ల‌హిరి తుది శ్వాస విడిచారు. పేర్గాంచిన సంగీత ద‌ర్శ‌కునిగా హిందీ, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డం, గుజ‌రాతి చిత్రాల‌కు సంగీతం అందించారు.

Advertisement

ప‌శ్చిమ‌బెంగాల్లోని క‌ల‌క‌త్తాలోని శాస్త్రీయ సంగీతం నేర్పించే సంప్ర‌దాయ కుటుంబంలో బ‌ప్పీ జ‌న్మించారు. బ‌ప్పీ అస‌లు పేరు అలోకేష్ ల‌హిరి. తండ్రి అప‌రేష్ ల‌హిరి ప్ర‌సిద్ధ బెంగాళి గాయ‌కుడు, త‌ల్లి, బ‌న్సారి ల‌హిరి సంగీత విద్వంసురాలు. 19 ఏళ్ల వ‌య‌స్సులో సంగీత ద‌ర్శ‌కుడిగా వృత్తిని చేప‌ట్టిన బ‌ప్పిల‌హిరి, 2018లో జ‌రిగిన 63వ ఫిల్మ్ పేర్ అవార్డుల‌లో బ‌ప్పిల‌హిరి ఫిల్మ్ ఫెయిర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అందుకున్నారు. హిందీలో చివ‌రి సారిగా 2020లో బాగీ-3లోని పాట‌కు సంగీతం అందించారు.

చివ‌రి సారిగా తెర‌పై స‌ల్మాన్‌ఖాన్ షో బిగ్‌బాస్-15లో క‌నిపించారు. తెలుగులో కృష్ణ‌, చిరంజీవి, బాల‌కృష్ణ వంటి ప్ర‌ముఖ తెలుగు న‌టుల సినిమాల‌కు సంగీతం అందించారు.

Also Read :  హీరోయిన్ గౌత‌మి వ‌దిలేసిన మొద‌టి భ‌ర్త ఎవ‌రో తెలుసా..?

1986లో సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన సింహాస‌నం చిత్రానికి బ‌ప్పి ల‌హిరి సంగీతం అందించారు. ఇందులో ఆకాశంలో ఒక తార పాట అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ అయింది.

Advertisement

మెగాస్టార్ చిరంజీవి, రాధ‌, భానుప్రియ‌, ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన స్టేట్‌రౌడీ చిత్రానికి బ‌ప్పి ల‌హిరి సంగీతమందించారు. ఇందులో రాధా రాధా సాంగ్, చుక్క‌ల ప‌ల్ల‌కిలో పాట‌లు ఇప్ప‌టికీ సూప‌ర్ హిట్‌.

అదేవిధంగా చిరంజీవి, విజ‌య‌శాంతి జంట‌గా న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్ చిత్రానికి ప‌ని చేశారు. ఈ సినిమాలోని ప్ర‌తిపాట బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌.

మెగాస్టార్ చిరంజీవి, దివ్యభారతి కాంబోలో వచ్చిన రౌడీ అల్లుడు చిత్రానికి బప్పీ సంగీతమందించారు. ఇందులోని చిలుకా క్షేమమా అనే పాట ఇప్పటికీ శ్రోతలను మంత్రముగ్దులను చేస్తోంది.

డైలాగ్ కింగ్ మోహన్ బాబు, శోభన నటించిన రౌడీ గారి పెళ్లాం సినిమాతో ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. ఇందులో బోయవాని వేటకు గాయపడిన కోయిలా పాట ఇప్పటికీ సూపర్ హిట్ అనే చెప్ప‌వ‌చ్చు.

Also Read :  హీరోయిన్ గౌత‌మి వ‌దిలేసిన మొద‌టి భ‌ర్త ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading