టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తకొచ్చేది పవన్ కళ్యాణ్. ఆయన వీరాభిమానిగా ఆయన మాట్లాడిన మాటలే. మెగా ఫ్యామిలీ అంటే ప్రత్యేకమైన అభిమానం చూపించే బండ్ల గణేష్ ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో ఇక చెప్పలేం. ఓ సారి ఇష్టమంటాడు. మరోసారి తిడుతాడు. మరోసారి నేలకేసి కొడితే.. మరోసారి నెత్తిన పెట్టుకుంటాడు. ఇలాంటి బండ్ల గణేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు తనదైన శైలిలో దూకుడుగా సమాధానాలు చెప్పాడు.
Advertisement
ముఖ్యంగా భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో తన వాయిస్‌తో విడుదలైన ఆడియో టేప్ పై బాంబ్ పేల్చాడు. పవన్ కళ్యాణ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ మాట్లాడే మాటలకే కొందరూ ఫ్యాన్స్ ఉంటారు. ఉదాహరణకి వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచ్‌కి ఆ రేంజ్ రియాక్షన్ వచ్చిందనే చెప్పవచ్చు. బండ్ల గణేష్ లా తాను కూడా మాట్లాడలేనంతగా పవన్ కళ్యాణ్ సైతం చెప్పిన సంగతి మనకు గుర్తుండే ఉంటుంది. అదే ఊపుతో బండ్ల గణేష్ పవన్ తన తరువాత మూవీ భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ఈవెంట్ స్పీచ్ తో సిద్ధమయ్యాడు. త్రివిక్రమ్ మధ్యలో ఆయనను రానీయలేదని టాక్.
Advertisement
Also Read : పొన్నియిన్ సెల్వన్ లో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా ?
ఇక ఈ విషయంపై బండ్ల గణేష్ సైతం త్రివిక్రమ్ సీరియర్ అయ్యాడు. అభిమాన హీరో ఫంక్షన్‌కి తనను పిలవకపోవడంపై బండ్ల గణేష్ త్రివిక్రమ్ పై ఓ రేంజ్‌లో సీరియస్ అయ్యాడు. వాడు, వీడు అంటూ రెచ్చిపోయి తిట్టాడు. త్రివిక్రమ్‌ని తిట్టిన ఆడియో బయటికీ కూడా లీకై పెద్ద సంచలనంగా మారింది. ఇక ఆ ఆడియోలోని వాయిస్ తనది కాదని అప్పట్లో చెప్పిన బండ్ల గణేస్ తాజాగా అందరికీ షాక్ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్రివిక్రమ్‌ని తిట్టిన వాయిస్ నాదే. అప్పుడు ఏదో కోపంలో తిట్టాను. దానికి ఆయనకు సారీ కూడా చెప్పానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఏదైతేనేం చాలా రోజులకు బండ్ల గణేష్ తన విషయంలో నిజాన్ని నిర్భయంగా చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : అన్‌స్టాపబుల్ సీజన్ 2 టీజర్ వచ్చేది ఎప్పుడో తెలుసా..?