Home » ‘సలార్’ వాయిదాపై స్పందించిన చిత్ర యూనిట్.. కొత్త డేట్ ఎప్పుడంటే..?

‘సలార్’ వాయిదాపై స్పందించిన చిత్ర యూనిట్.. కొత్త డేట్ ఎప్పుడంటే..?

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్-కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ సలార్. ఈ మూవీ వాస్తవానికి సెప్టెంబర్ 28న విడుదలవుతుందని ఇదివరకు ప్రకటించారు. గత కొద్ది రోజుల నుంచి సలార్ మూవీ వాయిదా పడుతుందనే వార్తలు వినిపించాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. దీంతో సలార్ మూవీ విషయంలో అసలు వాస్తవమా కాదా అనేది క్లారిటీ లేకుండా పోయింది. మరోవైపు బాహుబలి 2 తరువాత ప్రభాస్ కి ఒక్క హిట్ కూడా లేదు. అభిమానులు కూడా సలార్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఇప్పటికే పలుమార్లు సలార్ మూవీ వాయిదా పడింది. సలార్ మూవీ సెప్టెంబర్ 28న విడదల పెట్టుకొని ప్రమోషన్స్ చేయకపోవడం.. అసలు చిత్ర యూనిట్ దీనిపై స్పందించకపోవడంతో కొన్ని రోజులుగా సలార్ మూవీ వాయిదా పడుతుందని వార్తలు వినిపించాయి. పోస్ట ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాలేదని.. సీజీ వర్క్ ఇంకా అవ్వలేదని అందుకే సినిమా వాయిదా పడుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. చిత్ర యూనిట్ ఇన్నాళ్లు అధికారికంగా స్పందించకపోయినా సలార్ మూవీ సెప్టెంబర్ 28కి విడుదల కావడం లేదని.. వాయిదా పడిందని అందరికీ క్లారిటీ వచ్చేసింది.

Advertisement

సలార్ మూవీ వాయిదా పడటంతో వేరే చిన్న సినిమాలు అన్ని ఆ తేదీకి తమ సినిమాలను విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. సలార్ వాయిదా పడిందా లేదా అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది.. ఏదో ఒకటి స్పందించండి అంటూ ప్రభాస్ అభిమానులు చిత్ర యూనిట్ ని కోరుతున్నారు. ఎట్టకేలకు ఇవాళ ఉదయం సలార్ మూవీ వాయిదా పై చిత్ర యూనిట్ స్పందించింది. అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో సలార్ వాయిదా పై ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో సలార్ మూవీకి సపోర్టు చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కొన్ని అని వార్య కారణాల వల్ల సలార్ మూవీ సెప్టెంబర్ 28న విడుదల కావడం లేదు. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. మీకు మరింత మంచి సినిమాటిక్ అనుభవం అందించడానికి మా చిత్ర యూనిట్ చాలా కష్టపడుతుంది. సలార్ కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే చెబుతామని ట్వీట్ లో వెల్లడించారు. ఈ ట్వీట్ పై నెటిజన్స్ ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారు.. ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో చెప్పండి అని అడుగుతున్నారు. అధికారికంగా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ని ఎప్పుడూ ప్రకటిస్తుందో వేచి చూడాలి మరీ.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 స్వయంభు మూవీలో సంయుక్త అలాంటి పాత్రలో నటిస్తుందా ?

ఆ స్టార్ హీరోతో నటించొద్దు… కండిషన్ పెట్టిన జాన్వి కపూర్ తండ్రి…!

Visitors Are Also Reading