Home » అఖిల‌ప‌క్ష భేటీ నిర్వ‌హించాలి.. బండి సంజ‌య్ బ‌హిరంగ లేఖ

అఖిల‌ప‌క్ష భేటీ నిర్వ‌హించాలి.. బండి సంజ‌య్ బ‌హిరంగ లేఖ

by Anji
Ad

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్‌కుమార్ బ‌హిరంగ లేఖ రాశారు. కౌలు రైతుల ప‌ట్ల టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చూపుతున్న వివ‌క్ష క్ష‌మించ‌రానిది కాయ క‌ష్టం చేసే కౌలు రైతుల‌కు రైతు బంధు, రైతు బీమా, యంత్ర ల‌క్ష్మీ స‌హా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఏవీ వ‌ర్తించ‌క‌పోవ‌డం అన్యాయం. స‌బ్సీడి విత్త‌నాలు, ఎరువులు పొందే సౌక‌ర్యం కూడా కౌలు రైతుల‌కు లేక‌పోవ‌డం దారుణం అని లేఖ‌లో పేర్కొన్నారు బండి సంజ‌య్‌.

Also Read :  విజయ్ దేవ‌ర‌కొండ‌తో పెళ్లి….క్లారిటీ ఇచ్చిన ర‌ష్మిక‌…!

Advertisement

తెలంగాణ‌లో 14 ల‌క్ష‌ల మంది కౌలు రైతుల‌కు ప్ర‌భుత్వం నుంచి ఏ ఒక్క సంక్షేమ ప‌థ‌కం అమ‌లు కాక‌పోవ‌డం బాధాక‌ర‌మ‌ని, భూయ‌జ‌మానుల హ‌క్కులకు భంగం వాటిళ్ల‌కుండా కౌలు రైతుల‌కు భ‌రోసా క‌ల్పించే విధంగా కౌలు చ‌ట్టంలో మార్పులు తీసుకురావాల‌న్నారు. 11వ పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక‌లో పేర్కొన్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం శోచ‌నీయం. కౌలు రైతుల‌కు పావ‌లా వ‌డ్డీకే రుణాలు ఇవ్వాల‌ని నా బార్డు సూచించినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు.

Advertisement

భూమిని సాగు చేసి పంట పండించే వాడే నిజ‌మైన రైతు. అలాంటి రైతుకు బోన‌స్ స‌హా ఎరువులు, విత్త‌నాల‌తో పాటు వ్య‌వ‌సాయ స‌బ్సీడీల‌న్ని అందించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంది. రాష్ట్రంలో కౌలు రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రానికి త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు చేప‌ట్టాలి. కౌలు రైతుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు రైతు సంఘాలు, మేధావులు, అన్ని రాజ‌కీయ పార్టీల‌తో త‌క్ష‌ణ‌మే అఖిల ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించాల‌ని లేఖ‌లో బండి సంజ‌య్ డిమాండ్ చేశారు.

Also Read :  ఐపీఎల్ నుంచి ఆ స్టార్ ఓపెన‌ర్ ఔట్‌.. అందుకే ఎస్ఆర్‌హెచ్ తీసుకోలేదా..?

Visitors Are Also Reading