Telugu News » విజయ్ దేవ‌ర‌కొండ‌తో పెళ్లి….క్లారిటీ ఇచ్చిన ర‌ష్మిక‌…!

విజయ్ దేవ‌ర‌కొండ‌తో పెళ్లి….క్లారిటీ ఇచ్చిన ర‌ష్మిక‌…!

by AJAY MADDIBOINA

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న ప్రేమ‌లో ఉన్నారంటూ గ‌త కొద్దిరోజులుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా వీరిద్ద‌రూ త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ టాలీవుడ్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ ర‌ష్మిక పెళ్లి వార్త‌లు రావ‌డం వెన‌క కొన్నికార‌ణాలు ఉన్నాయి. విజయ్ దేవ‌ర‌కొండ ర‌ష్మిక‌ల కాంబినేష‌న్ లో గీతాగోవిందం సినిమా వ‌చ్చింది.

Ads

ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమా త‌ర‌వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో డియ‌ర్ కామ్రేడ్ సినిమా వ‌చ్చింది. ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది. అయితే మొద‌టి సినిమా స‌మ‌యంలోనే ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింద‌ని వార్త‌లు మొద‌ల‌య్యాయి. ర‌ష్మిక విజ‌య్ దేవ‌ర కొండ ఇంటికి వెళ్ల‌డం ఇద్ద‌రూ క‌లిసి ముంబై గోవాలో చ‌క్క‌ర్లు కొట్ట‌డంతో ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరింది.

rashmika2

rashmika

అంతే కాకుండా వీరిద్దరూ ముంబైలో డేటింగ్ చేస్తున్నారంటూ కూడా టాక్ వినిపించింది. దీనిపై విజ‌య్ దేవ‌ర‌కొండ రీసెంట్ గా స్పందించారు. అవి ఫేక్ న్యూస్ లు అంటూ బూతు ప‌దంతో స‌మాధానం ఇచ్చారు. ఇక తాజాగా ఇదే మ్యాట‌ర్ పై ర‌ష్మిక మంద‌న కూడా స్పందించింది. మీరు విజ‌య్ దేవ‌ర‌కొండ పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నించ‌గా…..ఆ వార్త‌లు త‌న దృష్టికి వ‌చ్చాయ‌ని..అలాంటి వార్త‌లు కొత్తేమీ కాద‌ని అన్నారు. ఇలాంటి వార్త‌లు విని న‌వ్వుకోవ‌డం అల‌వాటైపోయింద‌ని అన్నారు. వీటిని ప‌ట్టించుకునే స‌మ‌యం కూడా త‌న‌కు లేద‌ని ర‌ష్మిక వ్యాఖ్యానించింది.


You may also like