Telugu News » ఐపీఎల్ నుంచి ఆ స్టార్ ఓపెన‌ర్ ఔట్‌.. అందుకే ఎస్ఆర్‌హెచ్ తీసుకోలేదా..?

ఐపీఎల్ నుంచి ఆ స్టార్ ఓపెన‌ర్ ఔట్‌.. అందుకే ఎస్ఆర్‌హెచ్ తీసుకోలేదా..?

by Anji

వేస‌వి కాలం వ‌చ్చిందంటే ఐపీఎల్ మ్యాచ్‌లు జ‌రుగుతుంటాయి. ప్ర‌తీ సంవ‌త్స‌రం నిర్వ‌హించే ఐపీఎల్ మ్యాచ్‌లో క్రికెట్ అభిమానులు ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు చేసిన ఎంజాయ్ మ‌రే మ్యాచ్‌కు కూడా చేయ‌రేమో అన్న‌ట్టు అనిపిస్తుంటుంది. అయితే ఈ మెగా లీగ్ ప్రారంభానికి ముందే కొత్ టీమ్ ఆట‌గాడు షాక్ ఇవ్వ‌నున్నాడు. ముఖ్యంగా గుజ‌రాత్ టైటాన్స్‌కు భారీ షాక్ త‌గిలింద‌నే చెప్ప‌వ‌చ్చు. భారీ అంచ‌నాల‌తో కొనుగోలు చేసిన స్టార్ ఓపెన‌ర్‌, ఇంగ్లండ్ ఆట‌గాడు జాస‌న్ రాయ్ ఐపీఎల్ నుండి త‌ప్పుకున్నాడు.

Ads

Also Read :  Women’s World Cup 2022 : మార్చి 04 నుండే మ‌హిళ‌ల స‌మ‌రం.. 8 దేశాలు 31 మ్యాచ్‌లు

చాలా కాలంగా క‌రోనా కార‌ణంగా బ‌యోబ‌బుల్‌లో గ‌డుపుతున్నాన‌ని, దీంతో ఒత్తిడి పెరిగింద‌ని, అందుకే ఈ సీజ‌న్ నుండి త‌ప్పుకుంటున్న‌ట్టు రాయ్ వెల్ల‌డించాడు. రాయ్ త‌ప్పుకోవ‌డంతో గుజరాత్ జ‌ట్టుకు ఓపెన‌ర్ స‌మ‌స్య మొదలు కానుంది. ఒక ర‌కంగా చెప్పాలంటే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ‌తికి పోయింద‌నే చెప్పాలి. గ‌త సీజ‌న్‌లో త‌మ జ‌ట్టుకే ఆడిన జాస‌న్ రాయ్‌ను ఈసారి స‌న్‌రైజ‌ర్స్ టీమ్ రిటైన్ చేసుకోలేదు. మెగా వేలంలో కూడా అత‌ని కోసం ప్ర‌య‌త్నించ‌లేదు.

ముఖ్యంగా జాస‌న్ రాయ్ ఫిట్ నెస్ గురించి తెలిసే ఎస్ఆర్‌హెచ్ కావ్య మార‌న్ అతడిని కొనుగోలు చేయ‌లేదు అని, టాక్ న‌డుస్తోంది. ఏది ఏమైనా మెగా వేలంలో జాస‌న్‌రాయ్‌ను కొనుగోలు చేయ‌కుండా ఎస్ఆర్‌హెచ్ మంచి ప‌ని చేసింద‌ని అభిమానులు పేర్కొంటున్నారు. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 13 మ్యాచ్‌లు ఆడిన జాస‌న్ రాయ్ 29 స‌గ‌టుతో 329 ప‌రుగులు సాధించాడు.

Also Read :  విజయ్ దేవ‌ర‌కొండ‌తో పెళ్లి….క్లారిటీ ఇచ్చిన ర‌ష్మిక‌…!


You may also like