Home » Ravanasura Movie : ‘రావణాసుర’ నుంచి మాస్ గ్లింప్స్ రిలీజ్.. ఫ్యాన్స్ కు పూనకాలే

Ravanasura Movie : ‘రావణాసుర’ నుంచి మాస్ గ్లింప్స్ రిలీజ్.. ఫ్యాన్స్ కు పూనకాలే

by Bunty
Ad

రీసెంట్ గా ధమాకా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు రవితేజ. మాస్ మహారాజా నటిస్తున్న చిత్రాలు ఒకటి రావణాసుర. యూనిట్ త్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. మరో రెండు రోజుల్లో రవితేజ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ అందించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. రావణాసురలో అను ఇమ్మానుయేల్, పూజిత పొన్నాడ, దక్ష నగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

Advertisement

ఈ చిత్రంలో యువ నటుడు సుశాంత్ విలన్ గా నటిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజు, నితిన్ మెహతా కీలకపాత్రను పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని 2023 ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. రావణాసుర చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్-బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Advertisement

ఇవాళ రవితేజ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం గ్లింప్స్ ను రిలీజ్ చేసింది. రవితేజ పుట్టినరోజు నేపథ్యంలో ఈ అప్డేట్ ను ఇచ్చారు. కాగా ఈ ఏడాది అంటే ఏప్రిల్ ఏడో తేదీన 2023లో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉండగా, రావణాసుర పోస్ట్ థియేట్రికల్ రైట్స్ జీ నెట్వర్క్ కి భారీ ధరకు అమ్ముడయ్యాయి. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జి5 వద్ద ఉండగా, శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకుంది.

READ ALSO : ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్ : ప్రవేశ పరీక్షల షెడ్యూల్ 2023 విడుదల, ఎంసెట్ పరీక్ష ఎప్పుడంటే ?

Visitors Are Also Reading