Home » “అక్కినేని తొక్కినేని” అంటూ అవమానించిన నాగ్ సైలెంట్ గా ఉండడం వెనుక అసలు కారణం..!!

“అక్కినేని తొక్కినేని” అంటూ అవమానించిన నాగ్ సైలెంట్ గా ఉండడం వెనుక అసలు కారణం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో అక్కినేని ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అక్కినేని అభిమానులు నందమూరి బాలయ్య పై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ అక్కినేని ఫ్యామిలీని అవమానించారు. దీంతో అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా నందమూరి బాలయ్యపై విరుచుకుపడ్డారు.

Advertisement

also read:కస్తూరి స్విమ్మింగ్ వీడియో పై నెటిజన్ అలాంటి కామెంట్…దిమ్మ తిరిగిపోయే రిప్లై ఇచ్చిన నటి ..!

అలా మాట్లాడడం తప్పు అంటూ పోస్టులు పెట్టారు. అలాగే అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య, అఖిల్ కూడా స్పందించి ఒక నోట్ పెట్టి రియాక్ట్ అయ్యారు. ఇండస్ట్రీలో నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావుగారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు అని వారిని అగౌరవపరచడం మనల్ని మనం కించపరుచుకున్నట్లే అని ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అక్కినేని తొక్కినేని అని వారి ఫ్యామిలీని బాలకృష్ణ అంతా అవమానించిన అక్కినేని స్టార్ హీరో అయిన నాగార్జున మాత్రం ఎందుకు స్పందించలేదు అని నాగార్జున అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

Advertisement

ఇందులో నాగార్జున మౌనంగా ఉండడం ఫ్యాన్స్ కి నచ్చడం లేదట. ఇందులో మరో హీరో అక్కినేని సుమంత్ కూడా రెస్పాండ్ కాలేదు. అయితే బాలకృష్ణతో కలిసి సుమంత్ కథానాయకుడు మూవీలో అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్రలోను చేస్తున్నాడు. అందుకే కావచ్చు ఈ విషయంపై రియాక్ట్ అవ్వలేదని కామెంట్స్ వస్తున్నాయి. ఇక నాగార్జున మాత్రం ఈ విషయంపై ఎప్పుడు స్పందిస్తారో తెలియదు..? లేదంటే బాలకృష్ణ విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలేశారా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

also read:

Visitors Are Also Reading