Home » మోక్షజ్ఞ కు తారకరామ థియేటర్ కి విడదీయరాని సంబంధం.. బయటపెట్టిన బాలయ్య..!

మోక్షజ్ఞ కు తారకరామ థియేటర్ కి విడదీయరాని సంబంధం.. బయటపెట్టిన బాలయ్య..!

by Anji
Ad

హైదరాబాద్ నగరంలోని కాచిగూడలోని తారక రామ థియేటర్ కి ఓ ప్రత్యేకత ఉంది. ఈ థియేటర్ ఎన్టీఆర్, బసవతారకం ఇద్దరి పేర్లు కలిసి వచ్చే విధంగా ఎన్టీఆర్ తారకరామ పెట్టారు. ఈ థియేటర్ ని ఎన్టీఆర్, బాలకృష్ణ నటించిన అక్బర్ సలీం అనార్కలీతో ప్రారంభం అయింది. తాజాగా తారకరామ థియేటర్ ని నందమూరి నటసింహం బాలయ్య పున: ప్రారంభించారు. ఏషియన్ గ్రూపుతో కలిసి తారకరామ థియేటర్ ని కొత్త హంగులతో ముస్తాబు చేసింది నందమూరి కుటుంబం. 

Advertisement

తారకరామ థియేటర్ లో 590 సీట్ల సామర్థ్యంతో 4కే ప్రొజెక్షన్ తో థియేటర్ పున:ప్రారంభించారు. నిర్మాత శిరీష్, బాలయ్య ఫ్యామిలీ పాల్గొన్నారు. డిసెంబర్ 16 నుంచి అవతార్ 2 చిత్రంతో ఏషియన్ తారకరామలో ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి. ఈ థియేటర్ తమ కుటుంబానికి దైవంతో సమానం అని వెల్లడించారు బాలకృష్ణ. మరోవైపు ఈ థియేటర్ లోనే ఎన్టీఆర్.. మోక్షజ్ఞకి పేరు పెట్టారని గుర్తు చేశారు బాలయ్య. ఇక మూడోసారి తారకరామ థియేటర్ ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.  

Also Read :  బాహుబలి 2 లో అనుష్క పక్కన నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

Advertisement

బాలయ్య మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తారకరామ థియేటర్ కి ఓ చరిత్ర ఉన్నది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మా తల్లి జ్ఞాపకార్థం నిర్మించాం. అది మాకు ఒక దేవాలయం. అదేవిధంగా ఈ థియేటర్ తారకరామ థియేటర్ కూడా మాకు దేవాలయంతో సమానం. అమ్మనాన్నల పేర్లు కలిసి వచ్చేవిధంగా ఈ థియేటర్ ఏర్పాటు చేశారు. 1978లో తారకరామ థియేటర్ ని ప్రారంభింాం. మొదటి సినిమా అక్బర్ సలీం అనార్కలీతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో నేను, నాన్న ఇద్దరం కలిసి నటించాం. కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిచిపోయిన ఈ థియేటర్ ని తిరిగి 1995లో పున:ప్రారంభించాం. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా అధునాతన హంగులతో ఇప్పుడు మూడోసారి అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ థియేటర్ లో నేను నటించిన మంగమ్మగారి మనమడు ఈ థియేటర్ లోనే ఆడింది. అదేవిధంగా డాన్ సినిమా 525 రోజులు ఆడింది. ఏషియన్ సినిమాస్ సంస్థతో మాకు సత్సంబంధాలున్నాయి. వారితో కలిసి ఏషియన్ తారకరామను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉంది ని చెప్పుకొచ్చారు బాలయ్య. 

Also Read :   చాలా స్లిమ్ గా మారి ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా ?

Visitors Are Also Reading