సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య పోటీ కామన్. ఇంకా కొన్ని ప్రత్యేకమైన పండుగ దినాల్లో అయితే ఈ పోటీ మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అప్పుడు సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని ప్రతీ హీరో భావిస్తుంటాడు. అందుకే తమ సినిమాను సంక్రాంతి బరిలోకి దించాలని ప్రయత్నిస్తుంటారు. సంక్రాంతి సెంటిమెంట్ అనేది ఇప్పటి నుంచి కాదు కొన్ని దశాబ్దాల కాలం నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తోంది. అప్పట్లో టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ మధ్య సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉండేది. ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య కూడా పట్టింపులు ఉండేవని టాక్. సంక్రాంతి పండుగకు ఇద్దరు హీరోలు కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా సినిమాలు విడుదల చేయడంలో బాక్సాఫీస్ మొత్తం హిట్ ఎక్కిపోయేది.
Advertisement
ముఖ్యంగా 1999, 2001 సంవత్సరాల్లో రెండుసార్లు చిరంజీవి సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. బాలకృష్ణ నటించిన సినిమాలు మాత్రం సూపర్ హిట్ సాధించాయి. 1999 లో సంక్రాంతి కానుకగా చిరంజీవి స్నేహం కోసం, బాలకృష్ణ సమరసింహారెడ్డి వచ్చింది. రెండు సినిమాల్లో సమరసింహారెడ్డి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 2001లో చిరంజీవి మృగరాజు బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే మృగరాజు డిజాస్టర్ గా మిగిలింది. కానీ నరసింహ నాయుడు మాత్రం రికార్డులను తిరగరాసింది. అప్పట్లో చిరంజీవి సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ప్రత్యేకంగా కొన్ని థియేటర్లలో చిరంజీవి సినిమా తప్పక ఆడించేవారు.
Advertisement
Also Read : పుష్పను మిస్ చేసుకున్న 6గురు నటీనటులు..!
ఇలాంటి సినిమా థియేటర్ లలో పశ్చిమగోదావరి జిల్లాలోని సౌభాగ్య థియేటర్ ఒకటి. చిరంజీవి కోసమే కట్టారు అన్నట్టు చిరంజీవి ప్రతి సినిమా ఇక్కడ ఆడించేవారు. యావరేజ్ సినిమాలు కూడా ఇక్కడ వంద రోజులు అప్పట్లో ఆడించే వారు. థియేటర్ కు చిరంజీవి సినిమా థియేటర్ అని కూడా ఏర్పడిపోయింది. 2001లో సౌభాగ్య థియేటర్‌లో చిరంజీవి సినిమా మృగరాజుకు బదులు బాలకృష్ణ నరసింహానాయుడు విడుదల అయింది. ఈ సినిమా చిరంజీవి థియేటర్‌లో 100 రోజులు ఆడింది. చిరంజీవి మృగరాజు సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
Also Read : ఆ విషయాన్ని మాత్రం ఎవ్వరూ నొక్కి చెప్పరు.. ఎందుకంటే..?