Telugu News » Blog » ఆ విష‌యాన్ని మాత్రం ఎవ్వ‌రూ నొక్కి చెప్ప‌రు.. ఎందుకంటే..?

ఆ విష‌యాన్ని మాత్రం ఎవ్వ‌రూ నొక్కి చెప్ప‌రు.. ఎందుకంటే..?

by Anji
Ads

టాలీవుడ్ అగ్ర‌హీరోయిన్‌ల‌లో ఒక‌రైన స‌మంత నేటి త‌రం యువ క‌థానాయిక‌ల‌కు పోటీ ఇస్తూ త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. గ‌త ఏడాది విడుద‌లైన అల్లుఅర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాలో ఐట‌మ్ సాంగ్ న‌టించి క్రేజ్‌ను సంపాదించుకుంది. సామాజిక మాధ్య‌మాల్లో చురుకుగా ఉండే సామ్ కేవ‌లం వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త వికాసానికి సంబంధించి త‌రుచూ సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌తో షేర్ చేసుకుంటుంది.

samantha

samantha

తాజాగా త‌న కెరీర్ ఎదుగుద‌లకు ఎంతో తోడ్ప‌డేట‌టువంటి క్ర‌మ శిక్ష‌ణ గురించి స‌మంత వివ‌రించింది. ముఖ్యంగా క్ర‌మ‌శిక్ష‌ణ క‌ల‌గాల‌ని ఎవ్వ‌రూ కూడా నొక్కి చెప్పాల‌నుకోరు. క్ర‌మ‌శిక్ష‌ణ మ‌న‌ల‌ను బ‌లంగా త‌యారు చేస్తోంది. అలా ఉండ‌డం వ‌ల్ల ఒక్కోసారి మ‌న‌కు తాత్కాలిక ఆనందాలు ద‌క్క‌క‌పోవ‌చ్చు. మున్ముందు అంత‌కు మించిన ఫ‌లితాలు ద‌రికి చేరుతాయి. జీవితంలో ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించ‌డానికి ఇదే పునాది కూడా. మీరు కోరుకున్న వ‌న్నీ మీకు ఇచ్చేంత‌గా మిమ్మ‌ల్నీ మీరు ప్రేమించ‌డం కూడా త‌ప్ప‌నిస‌రి. ఇదే నిజ‌మంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స‌మంత పోస్ట్ చేసింది.

Also Read :  మ‌హేష్ త్రివిక్ర‌మ్ సినిమాలో కుర్ర హీరోయిన్..!

విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంఓ న‌య‌న‌తార‌, విజ‌య్‌సేతుప‌తితో క‌లిసి న‌టించిన త‌మిళ చిత్రం కాతు వాక్కుల రెండు కాద‌ల్ ఏప్రిల్‌లో విడుద‌ల కానున్న‌ది. అదేవిధంగా గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లం సినిమా కూడా ప్రోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. పాన్ ఇండియా చిత్రం సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌తో రాబోతున్న య‌శోద‌లో న‌టిస్తున్న‌ది స‌మంత‌.

Also Read :  Ratha Saptami 2022 : ర‌థ‌స‌ప్త‌మి రోజున ఈ మంత్రాల‌ను త‌ప్ప‌క‌ ప‌ఠించండి


You may also like