Home » ప్ర‌ముఖ న‌టుడు వ‌డ్డే న‌వీన్ భార్య ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

ప్ర‌ముఖ న‌టుడు వ‌డ్డే న‌వీన్ భార్య ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

by Anji
Published: Last Updated on
Ad

వ‌డ్డే న‌వీన్ గురించి ఇప్ప‌టి యువత‌కు పెద్ద‌గా తెలిసి ఉండ‌క‌పోవ‌చ్చు. రెండు ద‌శాబ్దాల కింద‌ట టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వ‌రుస విజ‌యాల‌తో ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో వ‌డ్డే న‌వీన్ ఒక‌రు.

Advertisement

ఆయ‌న చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ త‌క్కువ కాలంలోనే వ‌డ్డే న‌వీన్ స్టార్ డమ్‌ ను సొంతం చేసుకున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి :  మీకు ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా..? అయితే మీ కిడ్నిలో రాళ్లు వ‌చ్చిన‌ట్టే జాగ్ర‌త్త‌..!

 

ముఖ్యంగా కోరుకున్న ప్రియుడు సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన వ‌డ్డే న‌వీన్ ప్ర‌ముఖ నిర్మాత వ‌డ్డే ర‌మేష్ త‌న‌యుడు. ఇక అప్ప‌ట్లో టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌డ్డె న‌వీన్ హీరోగా, మ‌హేశ్వ‌రి హీరోయిన్‌గా తెర‌కెక్కించిన పెళ్లి చిత్రం అత‌ని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఆ త‌రువాత ప్రేమించే మ‌న‌స్సు, మ‌న‌సిచ్చి చూడు, మా బాలాజీ, చ‌క్రి వంటి సినిమాలు న‌వీన్‌కి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇత‌ను ఎంత వేగంగా త‌న కెరీర్ లో ఎదిగాడో అంతే వేగంగా ప‌డిపోయాడ‌నే చెప్ప‌వ‌చ్చు.

Advertisement

ఇవి కూడా చ‌ద‌వండి :  ఉదయ్ కిరణ్ అప్పుడే స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారా..? ఎంతంటే…?

వ‌డ్డె న‌వీన్ వ్య‌క్తి గ‌త విష‌యాల గురించి చాలా మందికి తెలియ‌దు. సినీ నేప‌థ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయినే న‌వీన్ వివాహం చేసుకున్నారు. స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు కుమారుడు రామ‌కృష్ణ కూతురు అయిన చాముండేశ్వ‌రిని వ‌డ్డే న‌వీన్ పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కార‌ణాల రిత్యా వ‌డ్డే న‌వీన్, చాముండేశ్వ‌రి విడిపోయారు. అయితే వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల వ‌ల్లే న‌వీన్ కెరీర్ విష‌యంలో ఇబ్బందులు ప‌డ్డాడ‌ని ప‌లువురు సినీ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఇక ఆ త‌రువాత వాత న‌వీన్ మ‌రొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్ర‌స్తుతం చాలా సంతోషంగా జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. గ‌త కొద్ది సంవ‌త్స‌రాల నుంచి సినిమాల‌కు దూరంగా ఉన్న న‌వీన్ చివ‌రగా నాలుగేళ్ల కింద‌ట‌ మ‌నోజ్ హీరోగా న‌టించిన ఎటాక్ సినిమాల్లో క‌నిపించారు వ‌డ్డే న‌వీన్‌. అస‌లు వ‌డ్డే న‌వీన్ సినిమాల్లో ఎందుకు న‌టించ‌డం లేద‌ని, ఉన్నట్టుండి సినిమాల‌కు దూరంగా ఎందుకు ఉన్నాడ‌ని ప‌లువురు చ‌ర్చించుకోవ‌డం విశేషం.

ఇవి కూడా చ‌ద‌వండి :  రాష్ట్రపతి మెచ్చిన సీనియర్ ఎన్టీఆర్ సినిమా ఏదో తెలుసా….? స్పెషల్ షో చూసి మరీ..! 

Visitors Are Also Reading