Home » చిరంజీవి కౌగిలించుకుంటే బాలకృష్ణ ఆశీర్వదించారు.. వీరిద్దరి మధ్య తేడా ఇదే..!

చిరంజీవి కౌగిలించుకుంటే బాలకృష్ణ ఆశీర్వదించారు.. వీరిద్దరి మధ్య తేడా ఇదే..!

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న సీరియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వీరికి ఇంత ఏజ్ వచ్చినప్పటికీ.. ఇప్పటికీ అగ్ర హీరోలుగా కొనసాగుతూనే ఉన్నారు. వీరిద్దరూ హీరోలు వరుస సినిమాల్లో స్టార్ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ హీరోల సినిమాలకు సైతం ఓ రేంజ్ లో బిజినెస్ జరగుతోంది. 

Advertisement

చిరంజీవి రెమ్యునరేషన్, బాలయ్య రెమ్యునరేషన్ మధ్య కాస్త వ్యత్యాసం ఉంటుంది. అయితే భోళా శంకర్ మూవీ ఈవెంట్ సమయంలో చిరంజీవి, కీర్తి సురేష్ ని కౌగిలించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా జరిగిన స్కంద ఈవెంట్ లో బాలయ్య శ్రీలీలను ఆశీర్వదించారు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో చిరంజీవి, బాలయ్య మధ్య తేడా ఇదేనంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్లను హీరోలు కౌగిలించుకోవడంలో తప్పు ఏం లేకపోయినా కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లి పాత్రలో నటించడంతో ఈ కామెంట్స్ వచ్చాయి. ఈ కామెంట్స్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య స్కంద మూవీ ఈవెంట్ లో రామ్ గురించి.. బోయపాటి గురించి చాలా గొప్పగా చెప్పారు. బోయపాటి శ్రీను పై ఉన్న అభిమానంతోనే ఈ ఈవెంట్ కి బాలయ్య హాజరైనట్టు తెలుస్తోంది. 

Advertisement

రామ్ ఫస్ట్ సినిమా దేవదాస్ కి గెస్ట్ గా హాజరైన బాలయ్య.. మళ్లీ స్కంద సినిమాతో ష్యూర్ షాట్ హిట్ సాధిస్తానని రామ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమాతో మాస్ ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ పెరుగుతుందని ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. స్కంద టైటిల్ పై మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తున్నా సినిమా మాత్రం వేరే లెవల్ లో ఉండనుందని తెలుస్తోంది. రామ్ కి భారీ సక్సెస్ దక్కాలని అభిమానులు ఫీల్ అవుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

మహేష్ బాబు – రానా మధ్య వివాదం…కారణం ఆ హీరోయిన్ ?

అతను స్టార్ క్రికెటర్.. కానీ కూతురు స్కూల్ ఫీజు కూడా చెల్లించలేని పరిస్థితి..!

Visitors Are Also Reading