Home » ముంబై అభిమానులకు బ్యాడ్ న్యూస్.. గాయంతో మరో ప్లేయర్ దూరం..!

ముంబై అభిమానులకు బ్యాడ్ న్యూస్.. గాయంతో మరో ప్లేయర్ దూరం..!

by Anji

ఐపీఎల్ 2023కి ముందు ముంబై ఇండియన్స్ కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ముంబై జట్టులోని ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ సన్ మళ్లీ గాయపడ్డాడు. ఐపీఎల్ వరకు గాయం నుంచి కొలుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. డిసెంబర్ 2022లో జరిగిన వేలంలో రిచర్డ్ సన్ ని ముంబై ఫ్రాంచైజీ రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసింది.  

Also Read :  ఎన్టీఆర్ నుంచి వచ్చిన ఆ చిత్రాలే అప్పట్లో టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్స్ !

రిచర్డ్ సన్ స్నాయువు గాయంతో పోరాడుతున్నాడు. బిగ్ బాష్ లీగ్ సమయంలో రిచర్డ్ సన్ గాయానికి గురయ్యాడు. జనవరి 04 నుంచి అతను ఈ గాయం కారణంగా మైదానానికి దూరంగా ఉన్నాడు. శనివారం తిరిగి వచ్చినా మళ్లీ మైదానం వీడాల్సి వచ్చింది. రిచర్డ్ సన్ గాయం కారణంగా రెండు నెలల పాటు మైదానానికి దూరంగా ఉన్న తరువాత గత శనివారం క్రికెట్ క్లబ్ ఫ్రిమాంటిల్ కోసం బరిలోకి దిగాడు. ఇక్కడ అతను 50 ఓవర్ల మ్యాచ్ లో కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేయగలిగాడు. 

Also Read :  CSK ఫ్యాన్స్ కు షాక్… ధోని సంచలన నిర్ణయం

అతను బౌలింగ్ చేయడంలో ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. అతను వెంటనే స్కాన్ కోసం వెళ్లాడు. ఇక ఆ తరువాత వైద్య పరీక్షలలో మరోసారి అతని స్నాయువు గాయం తెరపైకి వచ్చింది. అతనికి కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. రిచర్డ్ సన్ 2017లోనే అంతర్జాతీయ ఆరంగేట్రం చేసాడు. ఆ తరువాత 2019లో భుజం గాయం కారణంగా చాలా కాలం పాటు ఆస్ట్రేలియా జట్టుకు దూరంగా ఉన్నాడు. 26 ఏళ్ల ఈ ఆటగాడు ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరుపున మూడు ఫార్మాట్లలో మొత్తం 36 మ్యాచ్ లు ఆడాడు. అతని పేరిట మొత్తం 57 వికెట్లున్నాయి.   ఇప్పటికే గాయం కారణంగా బుమ్రా దూరమయ్యాడు. తాజాగా రిచర్డ్ సన్ దూరం కావడంతో ముంబైకి కోలుకోలేని ఎదురుదెబ్బ అనే చెప్పాలి. 

Also Read :  వివాదంలో IPL 2023…సిక్స్ గేట్ దూరం తగ్గించిన BCCI

Visitors Are Also Reading