Home » మొబైల్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్ ధరలు పెరిగే ఛాన్స్..?

మొబైల్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్ ధరలు పెరిగే ఛాన్స్..?

by Anji
Ad

 మెమరీ చిప్ ధరల పెరుగుదల – చైనీస్ యువాన్ బలపడటం వల్ల స్మార్ట్‌ఫోన్ ధరలు పెరగవచ్చు. అయితే, మధ్యంతర బడ్జెట్‌కు ముందు మొబైల్ ఫోన్ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని ఇటీవల తగ్గించడం వల్ల ధరలు పెద్దగా పెరగవని పరిశ్రమ అధికారులు చెబుతున్నారు. మార్కెట్ పరిశోధకుడు ట్రెండ్‌ఫోర్స్ మాట్లాడుతూ, DRAM కు సంబంధించి ఇద్దరు ప్రధాన సరఫరాదారులు ఉన్నారు – Samsung అలాగే  Micron. ఇవి రెండూ కూడా చిప్ ధరలను పెంచబోతున్నాయి. దీంతో మార్చి త్రైమాసికంలో మెమరీ చిప్‌ల  ధరలు 15-20 శాతం పెరిగే అవకాశముంది. తక్కువ సరఫరా కారణంగా 2024లో DRAM ధరలు పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Advertisement

ఎక్కువ ఇన్వెంటరీ ఉన్న ఉత్పత్తుల కాంట్రాక్ట్ ధర 3-8 శాతం మాత్రమే పెరుగుతుందని ట్రెండ్‌ఫోర్స్ జనవరి 1 నివేదికలో పేర్కొంది. దీనికి విరుద్ధంగా, కొరత ఉన్న ఉత్పత్తుల కాంట్రాక్ట్ ధర 5-10 శాతం మాత్రమే పెరుగుతుందని అంచనా. పలు జాతీయ వెబ్సైట్స్ లో వచ్చిన వార్తల ప్రకారం, చాలా మంది విక్రేతలు మార్చి త్రైమాసికంలో తగినంత ఉత్పత్తులను కలిగి ఉన్నందున వచ్చే త్రైమాసికం నుండి ధరలు పెరిగే అవకాశం ఉంది.  ఫిబ్రవరి మూడవ వారం నుండి మార్చి మొదటి వారం వరకు అధిక డిమాండ్ కారణంగా, మెమరీ ధరలు 10-15 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే, ప్రతి కంపెనీ  ధరలను పెంచవలసి ఉంటుంది.  అయితే ఇటీవలి దిగుమతి సుంకంలో  తగ్గుదల ధరలను తగ్గించడంలో సహాయపడవచ్చు.

 

Visitors Are Also Reading