ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనలో ఉంది. ఇరు జట్టుల మధ్య మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది. సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లు గెలిచిన ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ పాకిస్తాన్ లోని రావల్పిండిలో జరిగింది.ఇక ఈ మ్యాచ్ లో పరుగుల వరద వరదలై పారింది. రావల్పిండిలోని ఈ పిచ్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్రాజా స్వయంగా ఈ పిచ్ ని ఇబ్బందికరమైందిగా చెప్పుకొచ్చారు. తాాజాగా ఈ పిచ్ కి రెండోసారి బిలో యావరేజ్ రేటింగ్ ఇవ్వడం వల్ల ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఇబ్బందుల్లోకి నెట్టింది.
Advertisement
ఈ రావల్పిండి పిచ్ కి ఐసీసీ రెండోసారి డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కూడా ఈ పిచ్ కి ఐసీసీ డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. ఐసీసీ నుంచి వరుసగా రెండుసార్లు డీమెరిట్ పాయింట్లు పొందడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ముప్పుగా పరిగణించవచ్చు. ఈ డీమెరిట్ పాయింట్ ఐదుకి చేరితే.. ఈ మైదానం అంతర్జాతయీ క్రికెట్ లో 12 నెలల పాటు ఐసీసీ నుంచి నిషేదానికి గురికావచ్చు. ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్ కి చెందిన ఆండీ పైక్రాప్ట్ పిచ్ గురించి మాట్లాడుతూ.. ఇది చాలా ఫ్లాట్ పిచ్, ఇది ఏ రకమైన బౌలర్ కి ఎలాంటి సాయం అందించలేదు. బ్యాట్స్ మెన్ లు చాలా వేగంగా స్కోరు చేయడంతో పాటు ఇరు జట్లు కూడా భారీ స్కోరు సాధించడానికి ప్రధాన కారణం ఇదే. ఐసీసీ మార్గదర్శకాల ప్రకారం.. ఈ పిచ్ సగటు కంటే తక్కువగా ఉంది అని ఆండీ చెప్పుకొచ్చాడు.
Advertisement
Also Read : భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఆడిన 5 బెస్ట్ ఇన్నింగ్స్ ఇవే..!
పాకిస్తాన్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో రికార్డు స్కోరు సాధించిన విషయం విధితమే. ఇరు జట్ల బ్యాట్స్ మెన్స్ దూకుడు ప్రదర్శించారు. ఈ మ్యాచ్ లో మొత్తం స్కోరు 1768 పరుగులు చేశారు. టెస్ట్ క్రికెట్ లో ఇది మూడో అత్యధిక స్కోరుగా నిలిచింది. ఈ డీమెరిట్ పాయింట్లు ఇలాగే పెరిగినట్టయితే అంతర్జాతీయ మ్యాచ్ లకు రావల్పిండి మైదానం ఇక దూరంకాక తప్పదు అని క్రీడా నిపుణులు పలువురు హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న పాక్ కి ఐసీసీ రావల్పిండి పిచ్ కి డీమెరిట్ రేటింగ్ పాయింట్లు పాకిస్తాన్ కి మరో ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు.
Also Read : ఐపీఎల్ మినీ వేలానికి అంతా సిద్ధం.. ఏ జట్టు వ్యాలెట్లో ఎంత ఉందో తెలుసా..?