Home » ఈ ఫోటోలో ఉన్న బాబు ఓ స్టార్ హీరో.. ఎవ‌రో గుర్తు ప‌ట్టండి చూద్దాం..!

ఈ ఫోటోలో ఉన్న బాబు ఓ స్టార్ హీరో.. ఎవ‌రో గుర్తు ప‌ట్టండి చూద్దాం..!

by Anji
Ad

ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో చిన్ననాటి తీపి జ్ఞాప‌కాలు ఒక మ‌ధురం. జీవితంలో క‌చ్చితంగా బాల్యం అనేది ముఖ్య‌మైందో ఇక మాటల్లో చెప్ప‌లేం. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో చాలా మంది సినీ తార‌ల చిన్న‌నాటి ఫోలోలు వైర‌ల్ అవుతున్న విష‌యం తెలిసిందే. నార్త్‌, సౌత్ అనే తేడా లేకుండా హీరో, హీరోయిన్ల‌కు సంబంధించిన బాల్యం జ్ఞాప‌కాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఓ ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఇక వారిని గుర్తించ‌డానికి నెటిజ‌న్లు సైతం తెగ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అదేవిధంగా అభిమాన హీరో చిన్న‌ప్పుడు ఎలా ఉన్నారు అనే విష‌యం తెలుసుకోవ‌డంలో ముందుంటున్నారు.

Advertisement

ALSO READ:30 ఏళ్లు దాటిన మ‌హిళ‌లు ఈ ఐదు ర‌కాల ప‌రీక్ష‌లు త‌ప్ప‌క చేయించుకోండి

ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, ప్ర‌భాస్‌, అల్లు అర్జున్‌, నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, కాజ‌ల్‌, సమంత‌, త‌మ‌న్నా, కృతిశెట్టి, న‌య‌న‌తార ఇలా అంద‌రు చిన్న‌నాటి ఫోటోలు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం అయ్యాయి. తాజాగా ఇక్క‌డ ఫోటోలో క‌నిపిస్తున్న చిన్నోడి ఫోటో ఇప్పుడు స్పెష‌ల్ అట్రాక్ష‌న్ అవుతోంది. ఇత‌ను ఇండ‌స్ట్రీనే ఏలేస్తున్న ఓ పెద్ద స్టార్. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. లైఫ్ హ్యాపీగా కొన‌సాగుతుంది. ఇక ఆ హీరో అంటే అభిమానుల‌కు ఇష్టం మామూలుగా ఉండ‌దు. సాధార‌ణంగా న‌ట‌న‌తో త‌న‌దైన స్టైల్‌లో న‌టిస్తూ కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇక ఇప్ప‌టికైనా ఆ హీరో ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

Advertisement

ఆ హీరో మ‌రెవ్వ‌రో కాదండోయ్‌.. కోలీవుడ్ బిగ్ స్టార్ అజిత్‌కుమార్‌. సౌత్ ఇండియా స్టార్‌గా ఫేమ‌స్ అయిన అజిత్ సికింద్రాబాద్‌లోనే జ‌న్మించారు. ఇత‌ను సికింద్రాబాద్‌లో జ‌న్మించిన విష‌యం చాలా మందికి తెలియ‌దు. టాలీవుడ్‌లో శ్రీ‌క‌ర్‌గా ప్రేమ పుస్త‌కంతో అడుగుపెట్టాడు. ఇక త‌మిళంలో అజిత్ ప్రేమ‌లేఖ సినిమాని ఆయ‌నను అమ్మాయిల క‌ల‌ల రాజ‌కుమారుడుగా మార్చేసింద‌నే చెప్పాలి. అజిత్ కేవ‌లం ప‌ద‌వ‌త‌ర‌గ‌తి వ‌ర‌కు మాత్ర‌మే చ‌దువుకున్నాడు. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల‌తో పాటు ఇంగ్లీషులో కూడా స్ప‌ష్టంగా మాట్లాడుతాడు. తొలుత తాను బైకు మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. అజిత్ 22 ఏళ్ల కింద‌ట అన‌గా 2000 సంవ‌త్స‌రంలో తాను ప్రేమించిన హీరోయిన్ శాలిని నీ పెళ్లి చేసుకున్నారు. ప్ర‌స్తుతం టాప్ హీరోల‌లో ఒక‌రిగా కొన‌సాగుతున్నాడు.

ఇది కూడా చ‌ద‌వండి : Bigboss6 : నారాయణపై నాగార్జున సెటైర్ వేశారా..? మరీ అలా అనేశాడెంటబ్బా..!!

Visitors Are Also Reading