Home » అమెజాన్ లో అయోధ్య ప్రసాదం.. కేంద్రం నోటీసులు..!

అమెజాన్ లో అయోధ్య ప్రసాదం.. కేంద్రం నోటీసులు..!

by Sravya
Ad

అమెజాన్ లో అయోధ్య లడ్డూల పేరుతో నకిలీ ప్రసాదం అమ్మకాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. వివరాలు చూస్తే.. అయోధ్య లడ్డూలు అని అమెజాన్ లో ప్రసాదల అమ్మకాలని మొదలు పెట్టేసారు. భక్తులు, ప్రజలు కొనుగోలు చేయడానికి భారీగా ఆర్డర్లు ఇస్తున్నారు. భారీ లాభానికి అమెజాన్ కంపెనీలు తెగపడడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయోధ్య రాముడిని ప్రతిష్టించడానికి ఇంకా రెండు రోజులు ఉన్నాయి. దానిని ఆసరాగా తీసుకుని కొందరు అయోధ్య పేరుతో అమ్మకాలను జరుపుతున్నారు అమెజాన్లో అయోధ్య పేరుతో నకిలీ ప్రసాదాలు అమ్మకానికి పెట్టడం ఇప్పుడు కీలకంగా మారింది.

Advertisement

Advertisement

కేంద్రం అమెజాన్ ఫ్రాడ్ ని గమనించి నోటీసులు జారీ చేసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కి కంప్లైంట్ చేసింది. అధికారులు అమెజాన్ కి సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నోటీసులని ఇచ్చారు. జనవరి 22న జరిగే రామ మందిర ప్రతిష్టకి భారతదేశం అంతా కూడా ఎదురుచూస్తోంది. యావత్ దేశంలో ప్రముఖులు, భక్తులు హాజరు కాబోతున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని కొన్ని కంపెనీలు అయోధ్య పేరుని వాడుకుంటున్నారు ప్రసాదం, విభూది, హారం, అక్షింతలు అని ఆన్లైన్ విక్రయాలు చేస్తున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading