Home » అవతార్2 ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. చూస్తే పిచ్చేక్కాల్సిందే..!

అవతార్2 ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. చూస్తే పిచ్చేక్కాల్సిందే..!

by Anji
Ad

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎప్పుడు ఎప్పుడు ఎంతో ఆస‌క్తిగా, ఆతృత‌తో ఎదురుచూస్తున్నారు అవ‌తార్ 2 సినిమా కోసం. ముఖ్యంగా హాలీవుడ్ లెజెండ‌రీ డైరెక్ట‌ర్ జేమ్స్ కామెరాన్ సృష్టించిన గొప్ప విజువ‌ల్ వండ‌ర్ అవ‌తార్ చిత్రం ఏరేంజ్‌లో విజ‌యం సాధించిందో తెలిసిందే. ఇక దానికి సీక్వెల్‌గా వ‌స్తున్న చిత్రం అవ‌తార్ దివే ఆఫ్ వాట‌ర్‌. ఈ చిత్రాన్ని ఎన్న‌డు లేనివిధంగా ఏకంగా 160 భాష‌ల్లో డిసెంబ‌ర్ 16న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు.

ఇటీవ‌ల ఈ సినిమా ట్రైల‌ర్‌ను మే 06న డాక్ట‌ర్ స్ట్రేంజ్ ఇన్ ది మ‌ల్టీవ‌ర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ సినిమా ప్ర‌ద‌ర్శించే థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసారు. ఇక అవ‌తార్ ది వే ఆఫ్ వాట‌ర్ ట్రైల‌ర్ ను తాజాగా సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు.

Advertisement

Advertisement


ఈ ట్రైల‌ర్ పండోరా సంబంధించిన విజువ‌ల్స్‌తో ప్రారంభ‌మై.. అందులో ఉన్న అద్భుత‌మైన లొకేష‌న్లు మైమ‌రిపించే నీలి స‌ముద్రం అబ్బుర‌ప‌రిచేవిధంగా ఉన్నాయి. అవి చూస్తే మాత్రం పిచ్చిఎక్క‌డం ఖాయం. ట్రైల‌ర్ ఇంత ఆస‌క్తి ఉంటే ఇక సినిమా క‌థ ఏమిటి అనేది మాత్రం స‌స్పెన్స్‌గానే ఉన్న‌ది. ఈ సినిమా డిసెంబ‌ర్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. 2024లో అవ‌తార్ 3, 2026లో అవ‌తార్ 4, 2028లో అవ‌తార్ 5 సినిమాలు కూడా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

Also Read : 

అమ్మాయిల్లో అబ్బాయిలు ఏం గమనిస్తారో మీకు తెలుసా…?

పెళ్లిలో విద్యుత్ అంత‌రాయంతో మారిన జంట‌లు..!

Visitors Are Also Reading