Home » ఆల్క‌హాల్ తీసుకునేట‌ప్పుడు ఈ ప‌దార్థాల‌ను అస్స‌లు తిన‌కూడ‌ద‌ట‌..!

ఆల్క‌హాల్ తీసుకునేట‌ప్పుడు ఈ ప‌దార్థాల‌ను అస్స‌లు తిన‌కూడ‌ద‌ట‌..!

by Anji
Ad

సాధార‌ణంగా డ్రింక్‌, ఆహారం ఆర్డ‌ర్ ఇచ్చేట‌ప్పుడు మ‌నం పెద్ద‌గా ఆలోచించం. కేవ‌లం మ‌నం రుచిపై మాత్ర‌మే దృష్టిపెడుతుంటాం. త‌ప్పుడు ఆహారం, ఆల్క‌హాల్ క‌ల‌యిక‌లు పోష‌కాల శోష‌ణ వంటివి నిరోధించ‌గ‌ల‌వు. యాసిడ్ రిఫ్ల‌క్స్, ఉబ్బ‌రానికి కూడా కార‌ణ‌మ‌వుతాయి. రాత్రి పార్టీ చేసుకున్న త‌రువాత మీరు క‌చ్చితంగా ఉద‌యం అనారోగ్యంతో లేవ‌డం ఇష్టం లేదా..? అయితే మీకు ఇష్ట‌మైన డ్రింక్‌తో మీరు ఏమి తిన‌వ‌చ్చు, ఏమి తిన‌కూడ‌దో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

బీన్స్‌, రైడ్‌వైన్ : 

రాత్రి స‌మ‌యంలో మీ డిన్న‌ర్‌లో ఒక గ్లాస్ వైన్ తీసుకుంటే మీ భోజ‌నంలో బీన్స్ లేదా కాయ‌ధాన్యాలు ఏదైనా ఉంటే వీటికి దూరంగా ఉండాలి. బీన్స్ లేదా లెంటిల్‌లో అధిక మొత్తంలో ఐర‌న్ ఉంటుంది. వీటిని వైన్‌తో తీసుకున్న‌ప్పుడు మీ శ‌రీరం బాగా గ్ర‌హించ‌దు. వైన్‌లో టానిన్‌లు అనే స‌మ్మెళ‌నం ఉంటుంది. ముఖ్యమైన ఖ‌నిజాన్ని గ్ర‌హించ‌డంలో ఆటంకం క‌లిగిస్తుంది.

బ్రెడ్, బీరు :

బీరు తాగిన త‌రువాత క‌డుపు ఉబ్బిన‌ట్టు అనిపించ‌కూడ‌ద‌నుకుంటే ఈ ఆల్క‌హాలిక్ డ్రింక్‌తో బ్రెడ్‌ను నివారించండి. ఎందుకంటే రెండు వ‌స్తువుల‌తో ఈస్ట్ ఉంటుంది. మీ క‌డుపులో ఎక్కువ మొత్తంలో ఈస్ట్ జీర్ణం కాదు. ఇది జీర్ణ స‌మ‌స్య లేదా కాండిడా పెరుగుద‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంది.

సాల్టీఫుడ్ :

Advertisement

ఫ్రెంచ్ ఫ్రైస్‌, చీజీ నాచోల‌ను దాట‌వేయండి. రెండు స్నాక్స్‌ల‌లో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. మీరు ఆల్క‌హాల్ తీసుకునేట‌ప్పుడు ఇది మీ జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు హానిక‌రం. ఉప్పుగా ఉండే ఆహారం మీకు దాహం వేస్తుంది. మీరు చివ‌రికీ ఎక్కువ తాగుతారు. అదేవిధంగా ఆల్క‌హాల్ ఒక మూత్ర విస‌ర్జ‌న ప్ర‌భావాన్ని క‌లిగి ఉంటుంది. దీంతో మీరు ఎక్క‌వ సార్లు మూత్ర విస‌ర్జ‌నకు వెళ్లాల్సి వ‌స్తుంది.

పిజ్జా : 

ఆల్క‌హాల్ క‌డుపుని ఖాళీ చేసే ప్ర‌క్రియ‌ను ఆల‌స్యం చేస్తుంది. దిగువ అన్న‌వాహిక స్పింక‌ర్ లో ఒత్తిడిని త‌గ్గిస్తుంది. ఇది యాసిడ్ రిఫ్ల‌క్స్‌కి కార‌ణం అవుతుంది. మీరు మ‌రీనారా సాస్‌తో పిజ్జా తిన్న త‌రువాత ల‌క్ష‌ణాలు మ‌రింత తీవ్ర‌మ‌వుతాయి. మ‌రీనారా పిజ్జాలోని ఆమ్ల ట‌మోటాలు GERD, యాసిడ్ రిఫ్ల‌క్స్, వంటి గుండెలో మంట‌లు స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ట‌మాటా లేని పిజ్జా ఏదైనా తిన‌వ‌చ్చు.

చాక్లెట్ :

ఆల్క‌హాల్ తాగేట‌ప్పుడు దాని త‌రువాత కూడా చాక్లెట్‌, కెఫిన్ లేదా కోకో వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇత‌ర ఆమ్ల ఆహారాల ద్వారా ప్రేరేపించ‌బ‌డే గ్యాస్ట్రో స‌మ‌స్య‌ల‌ను కూడా తీవ్ర‌త‌రం చేస్తాయి. ఆహార ప‌దార్థాల‌కు బ‌దులుగా స‌లాడ్లు లేదా గింజ‌లు ఉంటాయి. అయితే ఈ ఆహార ప‌దార్థాల్లో పెద్ద మొత్తంలో సోడియం ఉండ‌కుండా చూసుకోవాలి.

Also Read :  చిరంజీవి సినిమాకి ర‌జినీకాంత్ జీవితానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading