Home » అవతార్ 2 సెన్సార్ పూర్తి.. నిడివి గురించి వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

అవతార్ 2 సెన్సార్ పూర్తి.. నిడివి గురించి వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

హాలీవుడ్ మూవీ అవతార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దర్శకుడు జేమ్స్ కామెరాన్ తన ప్రతిభతో పండోరా అంటూ కొత్త ప్రపంచాన్నే పరిచయం చేశారు. 2009లో వచ్చి విజువల్ వండర్ అవతార్ కి సీక్వెల్ గా వస్తున్న సినిమాకి అవతార్ దివే ఆఫ్ వాటర్. ఈ చిత్రం డిసెంబర్ 16 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

Avatar 2

Avatar 2

తాజాగా ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు U/A  సర్టిఫికేట్ అందజేశారు. ఈ చిత్రం ఎవ్వరూ ఊహించనంత నిడివి ఉండనుంది. తెలుగు సినిమాల కంటే ఎక్కువగానే దాదాపు 3 గంటల 12 నిమిషాల 10 సెకన్లు ఉండనుంది. సోషల్ మీడియాలో ఓ పిక్ తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రెండు ట్రైలర్లు విడుదల చేశారు. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ లో తమ తెగను కాపాడుకునే ప్రయత్నంలో చూపించిన యుద్ధ సన్నివేశాలు వావ్ అనిపిస్తున్నాయి. భారీ సెట్టింగ్ లు, ఫైట్స్, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. మరోమారు పండోరాకు తీసుకెళ్లారు దర్శకుడు జేమ్స్ కామెరాన్. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఏకంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవ్వనుంది.

Advertisement

Advertisement

తాజాగా అవతార్ 2 రీజనల్ లాంగ్వేజ్ కి భారీగానే బిజినెస్ జరిగినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ విడుదలకు రూ.120 కోట్ల వరకు రేటు పలికినట్టు తెలుస్తోంది. సూపర్ హిట్ టాక్ వస్తే వీకెండ్ లో రూ.100 కోట్ల వసూలు చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. దాదాపు 237 మిలియన్ డాలర్లతో తెరకెక్కిన అవతార్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లో 3 బిలియన్ యూఎస్ డాలర్స్  వసూలు చేసింది. అవతార్ సినిమాకి సంబంధించిన సీక్వెల్స్ ను డిస్నీ సంస్థ నిర్మిస్తోంది. అవతార్ 2 ఎన్ని లాభాలను తీసుకొస్తుందో వేచి చూడాలి. 

Also Read :  కాంతార, సాయి ధరమ్‌ తేజ్ విరూపాక్ష సినిమాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

Visitors Are Also Reading