Home » ఆసీస్​ సూపర్​ విక్టరీ.. కెప్టెన్‌గా కమిన్స్‌ అరుదైన ఫీట్‌

ఆసీస్​ సూపర్​ విక్టరీ.. కెప్టెన్‌గా కమిన్స్‌ అరుదైన ఫీట్‌

by Anji
Ad

సొంత గ‌డ్డ‌పై పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టుకు ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి రెండు టెస్ట్‌ల్లో బాగానే ఆడి డ్రా చేసుకున్న పాక్ జ‌ట్టు లాహోర్ వేదిక‌గా జ‌రిగిన మూడ‌వ టెస్ట్‌లో మాత్రం చేతులెత్తేసింది. ఆసీస్ చేతిలో 115 ప‌రుగుల తేడాతో భారీ ప‌రాభ‌వాన్ని ఎదుర్కుంది. మొదటి రెండు టెస్ట్‌లు డ్రాగా ముగియ‌డం వ‌ల్ల ఈ సిరీస్ ను 1-0 ఆసిస్ కైవ‌సం చేసుకుంది.


సొంత గ‌డ్డ‌పై పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టుకు ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. ఆస్ట్రేలియా జ‌రిగిన తొలి రెండు టెస్ట్ లో బాగానే ఆడిన చేసుకున్న పాక్ జ‌ట్టు లాహోర్ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్ట్‌లో మాత్రం చేతులెత్తేసింది. ఆసీస్ చేతిలో 115 ప‌రుగుల తేడాతో భారీ ప‌రాభ‌వాన్ని ఎదుర్కొంది. మొద‌టి రెండు టెస్ట్‌లు డ్రాగా ముగియ‌డం వ‌ల్ల ఈ సిరిస్‌ను 1-0 ఆసీస్ కైవ‌సం చేసుకుంది. దీంతో 24 సంవ‌త్స‌రాల త‌రువాత పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఆస్ట్రేలియా జ‌ట్టు టెస్ట్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. 2016 త‌రువాత ఆస్ట్రేలియాకు విదేశీ గ‌డ్డ‌పై ఇదే తొలిటెస్ట్ సిరీస్ విజ‌యం కావ‌డం విశేషం.

Advertisement

Advertisement


351 ప‌రుగుల ల‌క్ష్యంతో 76/0 ఐద‌వ రోజు ఆట‌ను పాక్ ఆరంభించింది. ఓవ‌ర్ నైట్ స్కోరుతో దిగిన బ్యాట‌ర్లు అబ్దుల్లా ష‌ఫిక్‌, అజ‌హ‌ర్ అలీ వెంట‌వెంటనే పెవిలియ‌న్ కు చేరారు. ఇమాముల్ హ‌క్ (70), సార‌థి బాబ‌ర్ అజామ్ (55) జ‌ట్టును ఆదుకున్నారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటూ మ్యాచ్‌ను డ్రాగా ముగించేలా పాక్ బ్యాట‌ర్లు క‌నిపించారు. అయితే బంతిని అందుకున్న నాథ‌న్ ల‌య‌న్ క్రీజులో పాతుకుపోయిన ఇమామూల్ హ‌క్‌, అజామ్‌ల వికెట్ల‌ను తీశాడు. వీరిద్ద‌రి త‌రువాత క్రీజులోకి వ‌చ్చిన బ్యాట‌ర్లు పెవిలియ‌న్ కు క్యూ క‌ట్టారు. టీ విరామం పాక్ ఐదు వికెట్ల‌ను మాత్ర‌మే కోల్పోయింది. మ‌రో సెష‌న్ ఆడి ఉంటే మ్యాచ్ డ్రాగా ముగిసేది. ల‌య‌న్‌, ప్యాట్ క‌మిన్స్ అద్భుత బౌలింగ్ పాక్ టీ విరామం త‌రువాత ఎక్కువ సేపు నిల‌వ‌లేక‌పోయింది. 235 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిపోయింది. ఈ విజ‌యంతో ఆసీస్ జ‌ట్టు ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ 2021-23 ప‌ట్టిక‌లో 72 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది.

Also Read :  Optical Illusion : తెలివైన వారు మాత్రమే చెప్పగలరు ఈ ఫొటోలో ఎంత మంది ఉన్నారో చెప్పగలరా ?

Visitors Are Also Reading