రెండు టెస్టులు వరుసగా గెలిచిన టీమిండియా జోరుకు బ్రేకులు పడ్డాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఇండోర్ లో జరిగిన మూడో టెస్ట్ లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు టెస్టులను గెలిచిన టీమిండియా జోరుకు బ్రేక్ వేసిన ఆసిస్ మూడో టెస్ట్ గెలిచి పరువు నిలుపుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా అధికారికంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో తన ప్లేను ఖరారు చేసుకున్నట్లే.
READ ALSO : The Legend: ఓటిటిలోకి లెజెండ్ శరవణన్ ‘ది లెజెండ్’… ఎందులో అంటే!
Advertisement
మరోవైపు టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే అహ్మదాబాద్ వేదికగా జరిగే చివరి టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అయితే ఈ మ్యాచ్ లో తోలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 109 పరుగులకే ఆల్ అవుట్ అయింది. భారత్ బ్యాటింగ్ లైనప్ మొత్తం విఫలమైంది. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ లో 197 పరుగులకు ఆల్ అవుట్ అయ్యి, 88 పరుగుల లీడ్ సాధించింది. జడేజా 4, అశ్విన్, ఉమేష్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
Advertisement
READ ALSO : Virupaksha Teaser : “విరూపాక్ష” టీజర్ వచ్చేసింది… మరీ ఇంత సస్పెన్సా..?
88 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పూజార మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో 163 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్ 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో మూడోరోజు ఉదయం ఒక్క వికెట్ కోల్పోయి టార్గెట్ ను చేదించింది. దీంతో సిరీస్ 2-1 గా మారింది. అయితే తొలి రెండు టెస్టుల్లానే ఈ టెస్ట్ కూడా మూడో రోజే ముగిసింది. కాగా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా చిత్తుగా ఓడేందుకు గల కారణం రోహిత్ కెప్టెన్సీ నేనని ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఇక ఈ టెస్ట్ ఓటమితో..WTC ఫైనల్ బెర్త్ ను కఠిన తరం చేసుకుంది టీమిండియా. అటు ఫైనల్ కు నేరుగా ఆసీస్ చేరుకుంది. ఇక టీమిండియా WTC ఫైనల్ బెర్త్ ను ఫైనల్ చేసుకోవాలంటే.. కచ్చితంగా 4వ టెస్ట్ గెలవాల్సిందే.
READ ALSO : విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన ఉమేష్ యాదవ్