Home » స్లో ఓవర్ రేట్ నివారణకు కొత్త ప్లాన్..!

స్లో ఓవర్ రేట్ నివారణకు కొత్త ప్లాన్..!

by Azhar
Ad

క్రికెట్ లో ఐసీసీ రూల్స్ ను చాలా సీరియస్ గా ఫాలోతుంది. అయితే ప్రస్తుతం క్రికెట్ లో అన్ని జట్లకు స్లో ఓవర్ రేట్ అనేది పెద్ద టెన్షన్ గా మారింది. స్లో ఓవర్ రేట్ అంటే.. నిర్ణిత సమయంలో బౌలింగ్ జట్టు ఓవర్ల కోటను పూర్తి చేయలేకపోతే దానిని స్లో ఓవర్ రేట్ అంటారు. అయితే గతంలో ఏ జట్టు అయిన స్లో ఓవర్ రేట్ కు గురి అయితే కెప్టెన్ కు జరిమానా వేసేవారు.

Advertisement

అలానే మళ్ళీ చేస్తే జట్టుకు.. ఆ తర్వాత కెప్టెన్ కు మ్యాచ్ నిషేధం విధించే వారు. కానీ ఇప్పుడు దానితో పాటుగా మరో శిక్ష కూడా వేస్తుంది. ఇచ్చిన సమయం కంటే ఎక్కువగా ఎన్ని ఓవర్లు వేస్తారో అన్ని ఓవర్ లలో.. ఒక్క ఫీల్డర్ తక్కువగా సర్కిల్ బయట ఉండాలి. ఇది బ్యాటింగ్ జట్టుకు చాలా హెల్ప్ అవుతుంది.

Advertisement

కానీ తాజాగా జరుగుతున్న ప్రపంచ కప్ లో స్లో ఓవర్ రేట్ కు నివారణ ప్లాన్ తో వచ్చింది ఆస్ట్రేలియా. మాములుగా బంతి బౌండరీ దగ్గరకు వెళ్తే ఫీల్డర్ అక్కడికి వెళ్లి తెచ్చే వరకు లెట్ అవుతుంది అని.. సపోర్ట్ స్టాఫ్ ను అలాగే ఎక్ట్రా ప్లేయర్స్ ను బౌండరీ బయట ఉంచుతుంది. అందువల్ల సమయం అనేది కలిసి వస్తుంది. ఈ ప్లాన్ పైన క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

ప్రపంచ కప్ లో ఇండియాకు ఈజీ.. ఎందుకంటే..?

పాకిస్థాన్ పర్యటన పై రోహిత్ వెర్షన్ ఇదే..?

Visitors Are Also Reading