Home » యాంకర్ సుమపై ట్రోల్స్.. కొడుకు సినిమా కోసం అలా పబ్లిసిటీ చేసిందంటూ..!

యాంకర్ సుమపై ట్రోల్స్.. కొడుకు సినిమా కోసం అలా పబ్లిసిటీ చేసిందంటూ..!

by Anji
Ad

తెలుగులో ప్రసారమవుతున్న ప్రముఖ డాన్స్ షో ఢీ ఇప్పటికే ఎన్నో సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఢీ సెలబ్రిటీ అనే సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది మల్లెమాల. అయితే ఈసారి బుల్లితెరపై నటించి మెప్పించిన కొందరు నటీనటులను డాన్సర్లుగా పరిచయం చేస్తూ, ఈ షోని ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా ఢీ సెలబ్రిటీ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఇక ఈ ఎపిసోడ్ కి యాంకర్ సుమ అతిథిగా హాజరైంది.


సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన బబుల్ గమ్ సినిమా రీసెంట్ గా విడుదల అయింది. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సుమ, రోషన్, హీరోయిన్ మానస ఢీ షోకి హాజరయ్యారు. ఇక శ్వేత నాయుడు అనే కంటెస్టెంట్ మ్యాడ్ చిత్రంలోని పడితే లైన్లో పడతది అనే సాంగ్ కి అదిరిపోయే విధంగా పర్ఫామ్ చేసి, అందులో భాగంగా నోట్లో నీళ్లు పోసుకుని మళ్లీ ఉమ్మేస్తూ చేసిన డాన్స్ మూమెంట్ ఆకట్టుకుంది. ఆమె డాన్స్ పై సుమ ఫన్నీగా స్పందించి, నేను చెప్పిన మూమెంట్ ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి అని అడిగింది.

Advertisement


మధ్యలో హైపర్ ఆది కలగజేసుకుని అంతగా చెబుతున్నారు కాబట్టి సుమ ఆ స్టెప్పులు వేస్తారని అన్నారు. దాంతో సుమ డాన్స్ చేస్తూ, నోట్లో నీళ్లు పోసుకుని వస్తూ ఉండగా, ఆ నీటిని హైపర్ ఆది బకెట్ తో పట్టుకోవాలని చూస్తాడు. కానీ ఒకసారి సుమ ఏకంగా హైపర్ ఆది ముఖం మీద డైరెక్ట్ గా ఉమ్మేయడం హాట్ టాపిక్ అయింది. వాళ్ళు ఫన్నీగా చేసినప్పటికీ ఎందుకో ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో వైరల్ కావడంతో కొందరు హైపర్ ఆది అభిమానులు యాంకర్ సుమపై మండిపడుతున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading