Home » “అత‌డు” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ దీప‌క్ ఇప్పుడు ఎలా ఉన్నాడో..? ఏం చేస్తున్నాడో తెలుసా..?

“అత‌డు” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ దీప‌క్ ఇప్పుడు ఎలా ఉన్నాడో..? ఏం చేస్తున్నాడో తెలుసా..?

by AJAY
Ad

కొంత‌మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు చేసింది చిన్న పాత్ర‌లే అయినా ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోతారు. కొంత‌మంది సినిమాలో ముఖ్య‌పాత్ర‌లో న‌టించినా అంతగా గుర్తింపు సాధించ‌లేరు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ చైల్డ్ ఆర్టిస్ట్ లు గా న‌టించిన చాలా మంది హీరోలుగా హీరోయిన్ లుగా ఎంట్రి ఇచ్చి స‌క్సెస్ అవ్వ‌గా మరికొంద‌రు సినిమాల‌కు దూరం అయ్యారు. ఇక టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా మెప్పించిన వారిలో దీప‌క్ స‌రోజ్ కూడా ఒక‌రు. దీపక్ స‌రోజ్ అత‌డు సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు.

Also Read:   Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు శత్రువుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి (manamnews.com)

Advertisement

 

ఈ సినిమాలో బ్ర‌హ్మానందం కొడుకుగా దీప‌క్ న‌టించి ఆక‌ట్టుకున్నాడు. అత‌డు సినిమాలో బ్రహ్మానందం ఇంటికి రాగానే …నాన్న ట్రైన్ కొనుక్కుని ర‌మ్మ‌ని చెప్పా ఎక్క‌డుంది అన‌గా ఫ్లాట్ ఫాం పై ఉంది వెళ్లి తీసుకోపో..అంటూ బ్ర‌హ్మి పంచ్ వేస్తాడు. దాంతో దీప‌క్ ఓకే అంటూ ప‌రిగెడ‌తాడు. అంతే కాకుండా బ్రహ్మి త‌న పొట్ట‌పై కొట్ట‌మని బిల్డప్ ఇవ్వ‌గా దీప‌క్ మ‌న స్కూల్ బెంచ్ లా ఎంత గ‌ట్టిగా ఉందిరా అంటూ డైలాగ్ కొడ‌తారు.

Advertisement

ఈ రెండు డైలాగుల‌తోనే దీప‌క్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్ప‌టికీ ఈ సీన్ లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉంటాయి. అదే విధంగా భద్ర సినిమాలోనూ దీప‌క్ న‌టించాడు. అన్న‌య్య చికెన్ వేసుకో సాంబార్ లో బాగుంటుంది అంటూ చిన్నారి చెబుతుంది. ఆ చిన్నారికి అన్న‌గా కనిపించింది కూడా దీప‌క్ కాగా ఈ సీన్ కూడా ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ ఉంటుంది.

 

దాదాపుగా దీప‌క్ 20కి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. క‌త్తిమ‌హేశ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మినుగురులు సినిమాలో ముక్య‌మైన పాత్ర‌లో న‌టించాడు. అంతే కాకుండా బిగ్ బాస్ 5 సీజ‌న్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ వార్త‌లు వినిపించాయి కానీ ఎంట్రీ ఇవ్వ‌లేదు. ఇక ఇప్పుడు దీప‌క్ స‌రోజ్ హీరో క‌టౌట్ లో క‌నిపిస్తున్నాడు. త్వ‌ర‌లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం. మ‌రి హీరోగా ఎంట్రీ ఇస్తే దీప‌క్ స‌క్సెస్ అవుతాడో లేదో చూడాలి.

Also Read:చిరంజీవిపై నాగబాబు కోపంతో ఉన్నాడా..? ఆ కామెంట్ల వెన‌క అర్థమేంటి..? (manamnews.com)

Visitors Are Also Reading