Home » ఆసియా కప్ షెడ్యూల్‌ విడుదల.. మొదటే భారత్, పాక్ పోరు..!

ఆసియా కప్ షెడ్యూల్‌ విడుదల.. మొదటే భారత్, పాక్ పోరు..!

by Azhar
Ad

ఆసియా కప్ 2018 లో చివరిసారిగా యూఏఈలో జరిగింది. అందులో రోహిత్ శర్మ న్యాయకత్వంలో పాల్గొన మన భారత జట్టు ఛాంపియన్స్ గా నిలిచింది. అయితే రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఈ ఆసియా కప్ 2020 లో కూడా జరగాలి. కానీ కరోనా కారణంగా అది జరగలేదు. కానీ ఇప్పుడు ఈ ఏడాది యూఏఈ వేదికగా మళ్ళీ ఆసియా కప్ అనేది జరగనుంది. అసలు ఈ టోర్నీ శ్రీలంకలో జరగాలి.. కానీ అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా యూఏఈకి తరలించారు.

Advertisement

ఇక తాజాగా ఈరోజు ఆసియా కప్ 2022 యొక్క సెహెడ్యూల్ అనేది విడుదల చేసారు. ఆగస్టు 27న ఈ టోర్నీ అనేది ప్రారంభం కానుంది. 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీకి ఇప్పటికే 5 జట్లు క్వాలిఫై కాగా ఇంకా ఒక్క జట్టు క్వాలిఫై కావాలి. అయితే ఈ టోర్నీలో మన భారత జట్టు మొదటి పోరే దాయాధి దేశం అయిన పాకిస్థాన్ తో చేయనుంది. 27న శ్రీలంక – ఆఫ్ఘానిస్తాన్ జట్లు తలపడిన తర్వాత 28న భారత్ , పాకిస్థాన్ ఎదురుపడనున్నాయి.

Advertisement

అయితే గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ లో పాకిస్థాన్ పై మన ఓటమికి ప్రతీకారం అనేది తీర్చుకోవాలి అని ప్రతి భారతీయుడు అనుకుంటున్నారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత ఈ నెల 31న ఇప్పుడు క్వాలిఫై కాబోయే ఆరో జట్టుతో టీం ఇండియా ఆ తర్వాత సెప్టెంబర్ 1 నుండి సూపర్ 4 అనేది ప్రారంభం అవుతుంది. ఇక సెప్టెంబర్ 11న ఫైనల్స్ తో ఈ టోర్నీ ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి :

టెస్ట్ అని చెప్పి చిక్కులో పడిన రోహిత్…!

టీం ఇండియా ఎంట్రీ కోసం పృథ్వీ షా ప్రయత్నాలు..!

Visitors Are Also Reading