Telugu News » Blog » టీం ఇండియా ఎంట్రీ కోసం పృథ్వీ షా ప్రయత్నాలు..!

టీం ఇండియా ఎంట్రీ కోసం పృథ్వీ షా ప్రయత్నాలు..!

by Manohar Reddy Mano
Ads
మన భారత్ లో క్రికెట్ అనేది ఎంత పెద్ద ఆట అనేది అందరికి తెలుసు. ఇక దీనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాదిరిగానే ఇందులో ఆటగాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. ఇక ప్రతి ఏడాది జరిగే ఐపీఎల్ వాళ్ళ ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. అక్కడి నుండి టీం ఇండియాలోకి వచ్చి.. ఇక్కడ సరైన ఆట అనేది చూపించకపోవడంతో తమ స్థానం కోల్పోతున్నారు. అయితే ఐపీఎల్ లో బాగా రాణించి ఇండియా జట్టులో ఆడలేకపోయే ఆటగాళ్లలో పృథ్వీ షా కూడా ఉంటాడు.
అయితే పృథ్వీ షాకు దేశీయ క్రికెట్ ఆడుతున్న సమయంలో అతని ఆట చూసి అందరూ అతడిని ఇండియా జట్టుకు ఎంపిక చేయాలి అన్నారు. అదే ఊపులో ఇండియా జట్టులోకి వచ్చిన పృథ్వీ షా మొదటి టెస్టులోనే సెంచరీ కూడా చేసాడు. కానీ ఆ తర్వాత అతై ఫోకస్ అనేది క్రికెట్ నుండి పక్కకు జరిగినట్లు కనిపించింది. అందువల్ల అతనికి జట్టులో చోటు అనేది కష్టం అయ్యింది. చివరగా గత ఏడాది శ్రీలంకకు వెళ్లిన రెండో జట్టులో పృథ్వీ షా ఆడాడు.
ఇక పృథ్వీ షాను ఇప్పుడు కనీసం రెండో జట్టుకు కూడా ఎంపిక చేయడం లేదు. అందుకు కారణం అతని ఫిట్నెస్ అని తెలుస్తుంది. మన ఇండియా జట్టులో ఆటగాళ్ల ఫిట్నెస్ కు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అందరికి తెలిసిందే. టాలెంట్ ఉన్న ఫిట్నెస్ లేకపోతే జట్టులోకి రావడం కష్టం. అదే విషయాన్ని బీసీసీఐ కూడా పృథ్వీ షాకు సూచించినట్లు తెలుస్తుంది. అందువల్ల పృథ్వీ షా ఇప్పుడు ఫిట్నెస్ పై ఫోకస్ చేసాడు. తాజాగా తన ఇంస్టా లో జిమ్ వీడియోను పోస్ట్ చేసి ”వెళ్లి పని మొదలెడదాం” అని క్యాప్షన్ ఇచ్చాడు.

You may also like