Home » ఐపీఎల్ లో ఆ పని చేసిన తొలి బ్యాటర్ గా నిలిచినా అశ్విన్..! 

ఐపీఎల్ లో ఆ పని చేసిన తొలి బ్యాటర్ గా నిలిచినా అశ్విన్..! 

by Azhar
Ad
భారత క్రికెటర్లలో ఆట గురించిన నియమాలు ఎక్కువ ఎవరికీ తెలుసు అంటే అందరూ చెప్పే పేరు రవిచంద్రన్ అశ్విన్. అయితే 2019 ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న అశ్విన్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో జోస్ బట్లర్ ను మన్కడింగ్ చేశాడు. అప్పుడు అశ్విన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఐపీఎల్ లో మన్కడింగ్ చేసిన తొలి బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ 2022 లో అదే రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున అడవుతున్న అశ్విన్ మరో పని చేసాడు. ఐపీఎల్ లో ఈ పని చేసిన మొదటి బ్యాటర్ అశ్విన్ కావడం గమనార్హం.
నిన్న ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో ఎవరు ఊహించని విధంగా అశ్విన్ రిటైర్డ్ ఔట్ అయ్యాడు. క్రికెట్ లో ఆటగాడు ఎవరైనా గాయపడి బ్యాటింగ్ చేయలేకపోతే దానిని రిటైర్డ్ హర్ట్ అంటారు. అలా గాయం కరంగా వెళ్లిన ఆటగాడు ఇన్నింగ్స్ చివర్లో మళ్లీ బ్యాటింగ్ కు రావొచ్చు. కానీ రిటైర్డ్ ఔట్ అంటే మాత్రం.. ఆటగాడు స్వతహాగా పెవిలియన్ బయటకు వెళ్తాడు. ఇలా చేయడానికి అంపైర్ అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. నిన్న అశ్విన్ ఇదే పని చేసాడు.
నిన్నటి మ్యాచ్ లో 23 బంతుల్లో 28 పరుగులు చేసిన అశ్విన్.. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మరో రెండు బంతులు మిగిలుండగానే రిటైర్డ్ ఔట్ గా వెనుదిరిగాడు. దాంతో మరో బ్యాటర్  రియాన్ పరాగ్ క్రీజులోకి వచ్చాడు. అయితే ఈ మ్యాచ్ లో లక్నో పై రాజస్థాన్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement

Visitors Are Also Reading