Home » అతియాను నిరాశకు గురిచేసిన రాహుల్..

అతియాను నిరాశకు గురిచేసిన రాహుల్..

by Azhar
Ad

భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అలాగే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి ప్రేమలో ఉన్నట్లు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అవి నిజం అనే విధంగానే ఈ ఇద్దరు కూడా ప్రవర్తిస్తుంటారు. అయితే ఐపీఎల్ 2022 లో లక్నో సూపర్ జెయింట్స్ కు కెప్టెన్ గా వ్యవరిస్తున్న రాహుల్ బ్యాటింగ్ లో విఫలమవుతున్నాడు. ఆడిన 5 మ్యాచ్ లలో రెండుసార్లు డక్ ఔట్ గా పెవిలియన్ చేరుకున్నాడు.

Advertisement

Advertisement

అయితే నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ గోల్డెన్ డక్ ఔట్ అయిన విషయం తెలిసిందే. కానీ ఈ ఔట్ అతని ప్రేయసి అతియా శెట్టిని బాధలో ముంచేసింది. ఎందుకంటే… రాహుల్ బ్యాటింగ్ చూద్దామని నిన్నటి మ్యాచ్ కు అతియా తన తండ్రి సునీల్ శెట్టితో కలిసి గ్రౌండ్ కు వచ్చింది. కానీ మొదటి బంతికే రాహుల్ ఔట్ కావడంతో షాక్ కు గురైన అతియా ఎక్స్ప్రెషన్ కెమెరాలకు చిక్కాయి. దాంతో ప్రస్తుతం రాహుల్ ఔట్ అయిన తీరు.. దానికి అతియా ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది.

ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం 166 పరుగుల లక్ష్యంతో వచ్చిన లక్నోకు ఆర్ఆర్ బౌలర్లు షాక్ ఇచ్చారు.వరుస వికెట్లు తీస్తూ… భాగసౌమ్యలను నెలకొల్పనివ్వకుండా చేసారు. దాంతో రాహుల్ జట్టు 20 ఓవర్లలో 162 పరుగులే చేయడంతో 3 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి వెళ్ళింది.

Visitors Are Also Reading