Telugu News » Blog » ఆసీస్ పైన ఓడిపోతే ప్రపంచ కప్ పోయినట్లే…!

ఆసీస్ పైన ఓడిపోతే ప్రపంచ కప్ పోయినట్లే…!

by Manohar Reddy Mano
Ads
ఆసియా కప్ లో భారత అభిమానులను నిరాశపరిచిన రోహిత్ సేన.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్ లో పోటీ పడటానికి సిద్ధం అవుతుంది. అనంతరం మళ్ళీ ఇండియా వేదికగానే సౌత్ ఆఫ్రికాతో పోటీ పడే భారత జట్టు.. ఆ తర్వాత ఆస్ట్రేలియా వేదికగా జరిగే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022 లో పాల్గొంటుంది. ఇక ఈ ఏడాది ఈ పోటీ ఫార్మాట్ లో ఛాంపియన్స్ గా నిలవాలని టీ ఇండియా తెగ ట్రై చేస్తుంది.
అయితే భారత జట్టు ఈ ప్రపంచ కప్ లో టైటిల్ ఫెవరెట్స్ లో కూడా ఉంది. కానీ నిజంగా టీం ఇండియా ఈ ప్రపంచ కప్ గెలవాలి అంటే.. ఓ పని చేయాలనీ భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇండియాలో ఆస్ట్రేలియాతో జరిగే పోటీ ఫార్మాట్ సిరీస్ లో ఆసీస్ ను ఓడించాలని పేర్కొన్నాడు.
నేను ఆడే సమయంలో 2007 ప్రపంచ కప్ లో సెమీస్ లో ఆస్ట్రేలియాను ఓడించం.. కప్ గెలిచాం. 2011 వన్డే ప్రపంచ కప్ లో ప్రీ క్వాటర్స్ లోనే ఆసీస్ ను ఓడించం.. టైటిల్ సాధించాం. అయితే ఆస్ట్రేలియా జట్టు అప్పుడు ఎంత బలంగా ఉందొ.. ఇప్పుడు కూడా అంతే బలంగా ఉంది. కాబట్టి ఇప్పుడు జరగబోతున్న సిరీస్ లో ఆసీస్ ను ఓడిస్తే టీం ఇండియా ప్రపంచ కప్ గెలుస్తుంది. లేదంటే.. ఇక అంతే అని గంభీర్ అన్నాడు.