Ad
సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది మాములు విషయం. కుటుంబంలో ఎవరో ఒక్కరు కష్టపడి ఇండస్ట్రీలోకి వస్తే.. ఇక వారిని పట్టుకొని మొత్తం ఫ్యామిలీ కూడా సినీ ప్రపంచంలోకి వస్తుంది అనే విషయం తెలిసిందే. ఇక హీరోలు. దర్శకులు, నిర్మాతలు అయితే తప్పకుండ తమ కొడుకులను హీరోగా చేస్తారు. అయితే టాలీవుడ్ లో ఎంతో పేరు తెచ్చుకున్నా దర్శకుడు వి వి సత్యనారాయణ.
ఆయన వారసులుగా నరేష్ అలాగే ఆర్యన్ రాజేష్ ఇద్దరు కూడా హీరోలుగా ఎంట్రీ అనేది ఇచ్చారు. అయితే అందులో ఎలాగో అలాగ నరేష్ అల్లరి నరేష్ గా గుర్తింపు అనేది తెచ్చుకొని.. హీరోగా నిలదొక్కుకున్నాడు. కానీ ఆర్యన్ రాజేష్ మాత్రం హీరోగా నిరూపించుకోలేకపోయాడు. అలా కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండి.. ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో ఓ పాత్రలో కనిపించాడు.
ఇక్కడి నుండి సెకండ్ ఇన్నింగ్స్ అనేది ప్రారంభించాలి అనుకున్న అతనికి సరైన అవకాశాలు అనేవి రాలేదు. దాంతో ఈ మధ్య సీనియర్ హీరోలు చేస్తున్న పని చేయాలనీ డిసైడ్ అయ్యాడట ఆర్యన్ రాజేష్. తాను కూడా విలన్ పాత్రలో చేయాలనీ ఫిక్స్ అయ్యాడు అని తెలుస్తుంది. అంతే కాకుండా.. తాజాగా విలన్ పాత్ర వచ్చిన ఓ సినిమాను ఆర్యన్ రాజేష్ ఒప్పుకున్నాడు అని కూడా తెలుస్తుంది. కానీ అందులో హీరో ఆనేరు అనేది మాత్రం క్లారిటీ లేదు.
Advertisement