Home » ఐపీఎల్ పై గంగూలీ కీలక ప్రకటన…!

ఐపీఎల్ పై గంగూలీ కీలక ప్రకటన…!

by Azhar
Ad
బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ అనేది ఎంత పెద్ద లీగ్ గా ఆవతరించింది అనే విషయం అందహరికి తెలిసిందే. గత ఏడాదితో 15 సీజన్లు అనేది పూర్తి చేసుకుంది ఐపీఎల్. అయితే వచ్చే ఏడాది నుండి పురుషుల ఐపీఎల్ తో పాటుగా మహిళల ఐపీఎల్ కూడా నిర్వహించాలి అని బీసీసీఐ ఫిక్స్ అయ్యింది. ఆ దిశగానే ప్రస్తుతం బీసీసీఐ అడుగులు వేస్తుంది. అయితే ఈ మహిళల ఐపీఎల్ గతంలోనే ప్రారంభం కావాలి.
కానీ కరోనా కారణంగా అది కుదరలేదు. ఇక పురుషుల ఐపీఎల్ కూడా రెండు సీజన్లు బయట యూఏఈ వేదికగా జరగగా.. గత ఏడాది ఇండియాలోనే కేవలం నాలుగు స్టేడియాలలోనే జరిగాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఎలా ఉండబోతుంది అనేది అందరూ ఆలోచిస్తున్నారు. ఇక తాజాగా బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన గంగూలీ.. పురుషుల, మహిళల ఐపీఎల్ పై ఓ క్లారిటీ అనేది ఇచ్చాడు.
దాదా మాట్లాడుతూ… వచ్చే ఏడాది నుండి మహిళల ఐపీఎల్ ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మా బోర్డు మొత్తం ఆదే పనిలో ఉంది.ఈ లీగ్ గురించి అందరం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నం. ఇక పురుషుల ఐపీఎల్ అనేది కరోనా కంటే ముందు ఎలా జరిగేదో అలానే జరగనుంది. హోమ్ గ్రౌండ్ లో సగం మ్యాచ్ లు.. బయట సగం మ్యాచులు అనేవి జరుగుతాయి అని గంగూలీ చెప్పాడు. దాంతో ఐపీఎల్ ఫ్యాన్స్ కు మళ్ళీ లైవ్ లో తమ జట్టు మ్యాచ్ చూసే అవకాశం వచ్చే ఏడాది నుండి కలగనుంది.

Advertisement

Visitors Are Also Reading