Home » అర్జున్ రెడ్డి సినిమాను చేతులారా మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

అర్జున్ రెడ్డి సినిమాను చేతులారా మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

by AJAY
Ad

టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచిన సినిమాల‌లో అర్జున్ రెడ్డి సినిమా కూడా ఉంటుంది. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించగా ఓవ‌ర్ నైట్ స్టార్ స్టేట‌స్ ను అందుకున్నాడు. ఈ సినిమా యూత్ ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక ఈ చిత్రంలో షాలిని పాండే హీరోయిన్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

arjun-reddy-heroine

arjun-reddy-heroine

షాలిని డీసెంట్ లో లుక్ లో కాలేజీ అమ్మాయిలా కనిపించి త‌న ప‌ర్ఫామెన్స్ తో అద‌ర‌గొట్టింది. అయితే నిజానికి ఇలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను ఓ స్టార్ హీరోయిన్ చేతులారా మిస్ చేసుకుంది. మొద‌ట ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం పార్వ‌తి నాయ‌ర్ వ‌ద్ద‌కు వెల్లింది. పార్వ‌తి నాయ‌ర్ తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా రానిస్తోంది. ఉత్త‌మ‌విల‌న్, నిమిర్ త‌దిత‌ర చిత్రాల‌లో పార్వ‌తి నాయ‌ర్ న‌టించింది.

Advertisement

Advertisement

అయితే మొద‌ట త‌న‌ను అర్జున్ రెడ్డి సినిమా ఆఫ‌ర్ త‌న‌కే వ‌చ్చింద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో పార్వ‌తి నాయ‌ర్ తెలిపింది. అయితే ఆ సినిమాలో లిప్ కిస్ స‌న్నివేశాలు….రొమా* ఉండ‌టంతో తాను నిరాక‌రించిన‌ట్టు వెల్ల‌డించింది. కానీ నిజానికి ఆ సినిమాను వ‌దులుకుని ఉండ‌కూడ‌ద‌ని భావించింది.

అర్జున్ రెడ్డి అంద‌మైన క‌థ అని ఆ సినిమాను మిస్ చేసుకున్నందుకు చాలా బాధ‌ప‌డ్డాన‌ని పార్వ‌తి నాయ‌ర్ వెల్ల‌డించింది. ఉత్త‌మ విల‌న్ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ కు జోడీగా న‌టించడం జీవితాంతం మ‌ర్చిపోలేని అనుభూతి అని చెప్పింది. అంతే కాకుండా త‌న‌కు ఒకే త‌ర‌హా పాత్ర‌లు మ‌ళ్లీ మళ్లీ చేయ‌డం ఇష్టం ఉండ‌ద‌ని చెప్పింది.

ALSO READ: వైజాగ్‌లో స్థలం కొన్న చిరంజీవి..ఆ స్థలం కోసం పోటీ పడి, అన్ని కోట్లు పోశారా !

Visitors Are Also Reading