Home » బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్తున్నారా..? అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో పడ్డట్టే జాగ్రత్త..!

బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్తున్నారా..? అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో పడ్డట్టే జాగ్రత్త..!

by Anji
Ad

ప్రతి ఒక్కరికి వారివారి సొంత బాత్రూమ్ అలవాట్లు ఉంటాయి. కొందరు వ్యక్తులు బాత్రూమ్ లో కూర్చుని వార్తాపత్రిక లేదా మ్యాగజైన్ చదవడానికి ఇష్టపడతారు. మరికొందరు పాటలు వినడానికి ఇష్టపడతారు. అయితే చాలామంది బాత్రూమ్ లో కూర్చుని ఫోన్లను ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఖాళీ సమయాన్ని వినియోగించుకుంటున్నామని వారు అనుకుంటారు. నిజానికి ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బాత్రూమ్ లో ఫోన్ ఉపయోగించడం చాలా ప్రమాదకరం. దీనివల్ల రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Advertisement


బ్యాత్రూమ్ లో కూర్చుని ఫోన్ ని ఉపయోగించడం వల్ల ఫైల్స్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఫైల్స్ ఉన్న విపరీతమైన నొప్పి, కొన్నిసార్లు రక్తస్రావం జరగవచ్చు. పురీషనాళం లేదా వాయువులోని సిరల సమూహాలు ఎర్రబడినప్పుడు ఇది సంభవిస్తుంది. సాధారణంగా ఇది పురీషనాళంలోని సిరలను ప్రభావితం చేసే ఒక రకమైన వేరికోస్ వెయిన్ వ్యాధి మలద్వారం లోపల లేదా వెలుపల హేమారాయిడ్లు సంభవించే అవకాశం కూడా ఉంది. ఏ ఇంట్లోనైనా టాయిలెట్ అంటే మామూలు గదిలా శుభ్రంగా ఉండదు. బాత్రూమ్ లో అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు బాత్రూమ్ లో కూర్చుని ఫోన్ ని ఉపయోగిస్తే బాత్రూమ్ లో ఉండే బ్యాక్టీరియా మీ ఫోన్ కి అంటుకుంటుంది.

Advertisement


ఆ తర్వాత ఫోన్ నుంచి బ్యాక్టీరియా నోటి ద్వారా ఇతర మార్గాల్లో సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఎలాంటి వ్యాధులైన సులభంగా వ్యాపిస్తాయి. మరైతే ఏం చేయాలి అనే ఆలోచిస్తున్నారా? అందుకు ఒకటే మార్గం. బాత్రూమ్ కి వెళ్లేటప్పుడు ఫోన్ తీసుకెళ్లకుండా ఉండడం చాలా అవసరం. దీనివల్ల ఫైల్స్ వచ్చే అవకాశాలు తగ్గడమే కాకుండా బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు కూడా తగ్గుతాయి. అలాగే మీ ఇంట్లో వెస్ట్రన్ టాయిలెట్ ఉంటే సీటుపై కూర్చున్నప్పుడు పాదాల కింద స్టూల్ పెట్టుకోండి. ఇది మీరు కూర్చునే స్థితిని మెరుగుపరుస్తుంది.

Visitors Are Also Reading