Home » ఫ్రిజ్‌లో పండ్లు, కూర‌గాయ‌ల‌ను పెడుతున్నారా..? అయితే ఈ విష‌యాలు త‌ప్ప‌కుండా తెలుసుకోండి..!

ఫ్రిజ్‌లో పండ్లు, కూర‌గాయ‌ల‌ను పెడుతున్నారా..? అయితే ఈ విష‌యాలు త‌ప్ప‌కుండా తెలుసుకోండి..!

by Anji
Ad

సాధార‌ణంగా గుడ్లు, కూరగాయలు, పండ్లు, బ్రెడ్ ఇలా ఏదైనా కూడా బయట నుంచి ఇంటికి తీసుకు రాగానే ఇవి ఎక్కువ కాలం ప్రెష్ గా ఉండేందుకు కొందరు ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ అన్ని కూరగాయలు, పండ్లు ఇతర ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టకూడదు. పెట్టకూడనివి కొన్ని ఉన్నాయి. ఫ్రిజ్ లో పెట్టాల్సినవి.. పెట్టకూడనివి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


టమాటాలను ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. వీటిని పెడితే అవి వాటి సహజ గుణాలను కోల్పోతాయి. వాసన పోతుంది. వాటితో వంటకం చేస్తే రుచి ఉండదు. అందుకే టమాటాలను ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్ లోనే ఉంచాలి. వీటితో పాటు అరటి పండ్లే కాదు అరటి కాయలు కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఫ్రిజ్ లో పెట్టిన అనంతరం అరటి పండ్లు నల్లగా మారిపోతాయి. వాటి రుచిని కోల్పోతాయి. అందుకే అరటి పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. తడిలేని ఏ ప్రదేశం లో ఉంచాలి.

Advertisement

Also Read : కాఫీని ఇలా తీసుకుంటే మీ బానా పొట్ట మాయం కావ‌డం ప‌క్కా..!

అవకాడో :

అవకాడో లను ఫ్రిజ్ లో పెట్టకూడదు. అలా పెడితే.. వాటిలోని గుణాలు పోతాయి. రుచి మారిపోతుంది. ఎంతో అరుదైన అవకాడో గాలి ఉండే ప్రదేశంలో లేదా తడిలేని చోట్ల పెట్టాలి.

పుచ్చకాయ :

సగం కోసిన పుచ్చకాయను ఎప్పుడు ఫ్రిజ్ లో పెట్టకండి. చాలా మంది ఈ విధంగా పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల దానిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పోవడమే కాదు.. వాటిని తిన్నా మీకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు దక్కవు.

Advertisement

వంకాయ :

వంకాయలను బయట పెట్టడం కంటే ఫ్రిజ్ లో పెడితేనే త్వరగా పాడైపోతాయి. అందుకే అలా అస్సలు చేయకండి.

Also Read : అక్టోబ‌ర్ నెల‌లో ఈ వ్యాధులు వ్యాపించే ప్ర‌మాదం ఉంది జాగ్ర‌త్త‌..!

ఉల్లిపాయ :

వెల్లుల్లి ఫ్రిజ్ లో ఉంటే జిగురు వస్తుంది. ఉల్లి కూడా అంతే.. ఈ రెండు కూడా వెలుతురు, గాలి తగిలే చోట ఉంటేనే తాజాగా ఉంటాయి.

చాక్లెట్లు :

చాక్లెట్లను చాలామంది డీప్ ఫ్రిజ్ లో పెడుతుంటారు. అలా చేయడం వల్ల వాటి సహజసిద్ధమైన రుచి ఫ్లేవర్ కోల్పోతాయి. ఫ్రిజ్ లో పెట్టి చాక్లెట్లు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వాటిని బయట పెట్టాలి అది కూడా కాంతి రాని చోట ఉండాలి.

Also Read : ఎంతటి నల్ల చర్మవైన 10 నిమిషాల్లో తెల్లగా మారుతుంది.. ఎలా అంటే.?

గుడ్లు :

చాలామంది ఇళ్లలో ఎగ్ ట్రేస్ ఫ్రిజ్ లో కనిపిస్తాయి. అయితే అలా చేయడం కరెక్ట్ కాదు. గుడ్లు బయట ఉంటేనే మంచిది. ఇవి మాత్రమే కాదు బ్రెడ్, బత్తాయి పండ్లు, తేనే, కాఫీ గింజలు, పీనట్ బటర్, దోసకాయలు, స్ట్రాబెర్రీస్ లాంటివి ఫ్రిజ్ లో పెట్టకూడదు. వీటిని బయట పెడితే మంచిది. అలాగే వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు తెచ్చుకుంటే బెటర్. ఎప్పటికప్పుడు తాజావి తెచ్చుకుంటుంటే ఆరోగ్య సమస్యలు దరికి చేరవు.

Also Read : అన్నం, చపాతి తినకుండా ఏం తినాలి..?

Visitors Are Also Reading